Narasimha Swamy: పీతపై నరసింహస్వామి ఆకారం.. కోనసీమలో అద్భుతం.! వీడియో..

Narasimha Swamy: పీతపై నరసింహస్వామి ఆకారం.. కోనసీమలో అద్భుతం.! వీడియో..

Anil kumar poka

|

Updated on: Jul 27, 2024 | 6:06 PM

అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో అద్భుతం జరిగింది. కాగితం కృష్ణ అనే వ్యక్తి కొనుగోలు చేసిన పీతల్లో ఒక దాని శరీరంపై నరసింహస్వామి అవతారం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్వామివారి ముఖం అచ్చుగుద్దినట్లు పీత పైభాగంపై ఉండడంతో దీన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. కాగితం కృష్ణ ఎప్పటిలాగానే స్థానికంగా ఉండే ఓ దుకాణం వద్ద పీతలు కొనుగోలు చేశారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో అద్భుతం జరిగింది. కాగితం కృష్ణ అనే వ్యక్తి కొనుగోలు చేసిన పీతల్లో ఒక దాని శరీరంపై నరసింహస్వామి అవతారం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్వామివారి ముఖం అచ్చుగుద్దినట్లు పీత పైభాగంపై ఉండడంతో దీన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. కాగితం కృష్ణ ఎప్పటిలాగానే స్థానికంగా ఉండే ఓ దుకాణం వద్ద పీతలు కొనుగోలు చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని శుభ్రం చేసేందుకు బయటకు తీశారు. శుభ్రం చేస్తు్న్న సమయంలో ఒక పీత విచిత్రంగా ఉండడాన్ని ఆయన గమనించారు. వెంటనే దాన్ని బయటకు తీసి చూసి ఆశ్చర్యha/ejg. పీతపై నరసింహస్వామి రూపం కన్పించటంతో చుట్టుపక్కల వారిని పిలిచి చూపించారు. ఇలాంటి పీతను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామం మెుత్తం పాకడంతో దీన్ని చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫొటోలు తీసుకుని కుటుంబసభ్యులు, బంధువులకు పంపించారు. మరికొంత మంది సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. తమ గ్రామంలో జరిగిన వింత చూడాలంటూ పోస్టులు పెట్టారు. పీతను చూసేందుకు వచ్చిన వారంతా ఇలాంటి దాన్ని తాము కూడా ఇంతవరకు చూడలేదన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.