Nipah Virus: కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళలో నిఫా వైరస్ సోకి 14 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటనతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. నిఫా వైరస్ నేపథ్యంలో కేరళ వెళ్లొద్దంటూ విద్యార్థులను వారించింది. ప్రమాదకరమైన నిఫా వైరస్ వ్యాప్తి పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. నిఫా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న చోట క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
కేరళలో నిఫా వైరస్ సోకి 14 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటనతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. నిఫా వైరస్ నేపథ్యంలో కేరళ వెళ్లొద్దంటూ విద్యార్థులను వారించింది. ప్రమాదకరమైన నిఫా వైరస్ వ్యాప్తి పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. నిఫా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న చోట క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు. కేరళను ఆనుకుని ఉండే నీలగిరి జిల్లాలో కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జ్వరం, ఎర్రటి దద్దుర్లు, బ్రెయిన్ ఫీవర్, మూర్ఛ తదితర లక్షణాలతో ఎవరైనా వస్తే వారిని క్వారంటైన్ చేసి తగిన చికిత్స అందించడంతో పాటు వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని జిల్లా ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. మృతి చెందిన బాలుడి కుటుంబంతో టచ్‌లోకి వచ్చిన బంధువుల్లో 17 మందికి పరీక్షలో నెగటివ్ వచ్చింది. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు. బాధితుడితో టచ్‌లో ఉన్న 17 మందికి చెందిన లాలాజలం శ్యాంపిళ్లను టెస్ట్ కోసం పంపామని, అయితే వాటి ఫలితాల్లో వైరస్ లేనట్లు గుర్తించామన్నారు. మలప్పురానికి చెందిన కుర్రాడు గత ఆదివారం నిఫా సోకి మృతిచెందాడు.
మలప్పురంలో ఐసోలేషన్‌లో ఉన్నవారు 21 రోజుల పాటు క్వారెంటైన్‌ను కొనసాగించాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్య చట్టాల ప్రకారం ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత బంధువులకు నిఫా సోకకున్నా.. ఆ ప్రాంతంలో మాత్రం నిబంధనలు అమలులో ఉంటాయని మంత్రి తెలిపారు. ఆంక్షలను ఇప్పుడు ఎత్తివేయలేమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని పేర్కొన్నారు. నిఫా వైరస్ తొలిసారిగా 1999లో వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి వ్యాక్సిన్ లేదు. ఇది జంతువుల ద్వారా మనుషులకు సోకుతుంది. 2018లో కేరళలో ఈ వైరస్ బారినపడి 27 మంది మృతి చెందారు. తాజాగా, కేరళలో మరోమారు నిఫా కలకలం రేగడంతో, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక వైద్య బృందాన్ని కేరళకు పంపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.