AP High Court Recruitment 2024: ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎలాంటి రాత పరీక్ష లేదు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 26 లా కర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీలోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 12 లా కర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీలోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనూ అడ్వకేట్‌గా నమోదు చేసుకుని ఉండకూడదు. దరఖాస్తుదారుల వయోపరిమితి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా విద్యార్హతలు, వైవా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35 వేల వరకు జీతభత్యాలు చెల్లిస్తారు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్‌ను నింపి, సంబంధిత డాక్యుమెంట్లను అటాచ్ చేసి.. ఆగస్టు 6, 2024వ తేదీలోపు.. ది రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్), హైకోర్టు ఆఫ్ ఏపీ, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించవల్సి ఉంటుంది.
ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టుల నోటిఫికషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సింగరేణిలో 327 పోస్టుల భర్తీ నియామక పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే
సింగరేణి సంస్థలో భారీగా పోస్టుల భర్తీకి ఈ ఏడాది మే నెలలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష తేదీలు తాజాగా వెల్లడయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 6, 7 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొంది. రోజుకు మూడు సెషన్‌లలో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్ష హాల్‌టికెట్లు త్వరలో విడుదల కానున్నాయి. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ కేడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మొత్తం 327 పోస్టులను భర్తీ చేయనున్నారు. మరోవైపు సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి జులై 21న నిర్వహించిన రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసి, కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జులై 27వ తేదీ ముగింపు సమయంలోగా అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు.