రాజస్థాన్ లోని అభనేరి పర్యాటక అద్భుతం.?
TV9 Telugu
27 July 2024
రాజస్థాన్ రాజధాని జైపూర్ నుండి 88 కిలోమీటర్ల దూరంలో జైపూర్-ఆగ్రా రహదారిపై ఉన్న అద్భుతమైన నగరం అభనేరి.
ఇది రాజస్థాన్ లోని దౌసాలో ఉన్న ప్రధాన ఆకర్షణ. ఈ నగరాన్ని చక్రవర్తి రాజా చంద్ర స్థాపించినట్లు చరిత్ర చెబుతుంది.
దీనికి అభా నగ్రి అని పేరు పెట్టారు. అంటే ప్రకాశవంతమైన నగరం అని అర్థం. దీనిని ఇప్పుడు అభనేరి అని పిలుస్తారు.
పర్యాటక శాఖ ఈ ప్రాంతంలో వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ అద్భుతమైన రెండు రోజుల "అభనేరి ఫెస్టివల్"ని నిర్వహిస్తుంది.
సాంస్కృతిక ప్రదర్శనలు, గ్రామ ఒంటె సఫారీ పండుగ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. అభనేరిలో చూడదగిన ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి చాంద్ బావోరి స్టెప్‌వెల్.
ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ బావి భారతదేశంవ్యాప్తంగా ఉన్న అనేక లోతైన, అతిపెద్ద మెట్ల బావుల్లో ఒకటి.
ఇది 19.5 మీటర్ల లోతున్న అసాధారణమైన నిర్మాణం. 13 అంతస్తుల వరకు విస్తరించి ఉన్న ఈ బావి 1000 మెట్లను కలిగి ఉంది.
మీరు రాజస్థాన్ పర్యటనకు వెళ్ళినట్లైతే ఖచ్చితంగా ఈ ప్రదేశాన్నిసందర్శించండి. ఇక్కడ పర్యటన అస్సలు మర్చిపోలేరు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి