బెండకాయలు తెలియని వారుండరు.. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా బెండకాయలను తినాల్సిందేనట
TV9 Telugu
అనేకానేక జీవనశైలి వ్యాధుల నివారణకు మందులు తీసుకోకూడదనుకుంటే.. కేవలం ఈ ఒక్క కూరగాయలను తింటే సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు
TV9 Telugu
ఆహారంలో బెండకాయలను చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గటానికి తోడ్పడుతున్నట్టు జంతువులపై చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది
TV9 Telugu
బెండకాయలో ఫాలీఫెనాల్స్ దండిగా ఉంటాయి. విజృంఖల కణాల పనిపట్టే యాంటీఆక్సిడెంట్ గుణాలు గల ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్, వాపు ప్రక్రియ తగ్గటానికి తోడ్పడతాయి
TV9 Telugu
బెండకాయ రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా రక్తంలో చక్కెర నియంత్రణలోనే ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజు త్వరగా కలవకుండా చేస్తుంది
TV9 Telugu
బెండలో ఖనిజాలు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తరచూ ఆహారంలో బెండ తీసుకుంటే పొట్ట కూడా శుభ్రంగా ఉంటుంది
TV9 Telugu
ముఖ్యంగా బెండ కాయలను నానబెట్టిన నీరు శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ నీరు అమృతంతో సమానం
TV9 Telugu
ఒక గిన్నే తీసుకుని అందులో బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, ఒక గ్లాసు నీరు పోసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో తాగితే సరి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది