AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్.. థియేటర్స్‌లో రచ్చ రచ్చే..

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్. అంతే కాదు ఆయన మైనపు విగ్రహాన్ని కూడా తయారు చేశారు. ఇక ఇప్పుడు బన్నీ పేరు తెలియాలని ప్రేక్షకుడు లేడు అనడంలో అతిశయోక్తి లేదు. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మారు మ్రోగుతుంది.

ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్.. థియేటర్స్‌లో రచ్చ రచ్చే..
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: May 02, 2024 | 4:47 PM

Share

అల్లు అర్జున్ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది.. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఒకే ఒక్క సినిమాతో దేశాన్నే ఆపేశాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్. అంతే కాదు ఆయన మైనపు విగ్రహాన్ని కూడా తయారు చేశారు. ఇక ఇప్పుడు బన్నీ పేరు తెలియాలని ప్రేక్షకుడు లేడు అనడంలో అతిశయోక్తి లేదు. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మారు మ్రోగుతుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత ప్రేక్షకులంతా పుష్ప 2కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. అలాగే తాజాగా పుష్ప నుంచి మొదటి సాంగ్ ను విడుదల చేశారు. మరోసారి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. పుష్ప పుష్ప అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్ బన్నీ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ను డ్యూయల్ రోల్ లో చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ కోరిక ఇప్పటికి నెరవేరబోతోందని తెలుస్తోంది.

అవును అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట.. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ సినిమా నుంచి ఓ క్రేజీ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని అంటున్నారు. ఇప్పటికి  ఈ సినిమాకు సంబందించిన కథ సిద్ధమైందని తెలుస్తోంది. కథ ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు పాత్రలో కనిపిస్తారట. కానీ ఒక పాత్రకు మరో పాత్రకు ఎలాంటి సంబందం ఉండదని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us