తీరప్రాంత రాష్ట్రాల ఐకానిక్ స్నాక్స్..

TV9 Telugu

02 May 2024

అన్నపూర్ణగా పిలవబడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాల పిండివంటలు ఉన్నాయి. వాటిలో ఐకానిక్ చెప్పాలంటే చకోడీ.

జగన్నాధుని నేలగా పేరు పొందిన తీర ప్రాంత రాష్ట్రం ఒడిశా. ఇక్కడ ప్రజలు ఎంతో ఇష్టంగా తినే ఆహారం ముధి-బరామజ.

తమిళనాడులో విరివిగా దొరికే స్నాక్స్ లో మురుక్కు ఒకటి. ఇది ఎంతో రుచికరంగా ఉంది. ఆంధ్ర, తెలంగాలో కూడా లభిస్తుంది.

కేరళను దేవతల భూమి అనే అంటారు. మరి ఈ సుందరమైన రాష్ట్రంలో మంచి ఫుడ్ కూడా ఉంది. ఉన్నియప్పం ఇక్కడ ఫేమస్ స్నాక్.

కర్ణాటకలో ఎక్కువగా దొరికే అంబోడే అక్కడి ఐకానిక్ స్నాక్. ఇది చాల రుచికరంగా ఉంటుంది. తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

గోవాలో దహి వడ చాల ఫేమస్. ఇక్కడి ప్రజలు ఇష్టంగా తింటారు. మీరు ఎప్పుడైనా వెళ్తే దీన్ని కచ్చితంగా ట్రే చెయ్యండి.

గుజరాత్ ఐకానిక్ స్నాక్ ధోక్లా. ఇది అక్కడ విరివిగా దొరికే రుచికరమైన ఆహారం. ప్రతి దుకాణంలో లభిస్తుంది.

పశ్చిమ బెంగాల్ అనే వెంటనే గుర్తి వచ్చేది కలకత్తా కాళీ మాత. ఈ రాష్ట్రంలో ఐకానిక్ స్నాక్ రుచికరమైన నిమ్కి.