Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంలో 4 సెకన్ల ఆలస్యం.. ఎందుకంటే.?
చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో 4 సెకన్ల పాటు ఆలస్యంగా బయలుదేరిందని ఇస్రో తెలిపింది . ఇందుకు కారణమేంటనేది తాజాగా నివేదికలో వెల్లడించింది. అంతరిక్ష వ్యర్థాలను ఢీ కొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి వీలుగా ఆలస్యంగా లాంచ్ చేసినట్లు తెలిపింది. కొలిజన్ ఆన్ లాంచ్ అవాయిడెన్స్ విశ్లేషణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో 4 సెకన్ల పాటు ఆలస్యంగా బయలుదేరిందని ఇస్రో తెలిపింది . ఇందుకు కారణమేంటనేది తాజాగా నివేదికలో వెల్లడించింది. అంతరిక్ష వ్యర్థాలను ఢీ కొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి వీలుగా ఆలస్యంగా లాంచ్ చేసినట్లు తెలిపింది. కొలిజన్ ఆన్ లాంచ్ అవాయిడెన్స్ విశ్లేషణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. చంద్రయాన్-3 వ్యోమనౌకను ఎల్‌వీఎం-3 రాకెట్ ద్వారా గత ఏడాది జులై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. నాడు ప్రయోగంలో నాలుగు సెకన్ల పాటు జాప్యం చేయడం వల్ల చంద్రయాన్-3 వ్యోమనౌకకు ముప్పు తప్పింది. అది ఎలాంటి ఇబ్బంది లేకుండా చందమామ దిశగా పయనం సాగించగలిగింది.
ఇలాంటి ముప్పును తప్పించుకోవడానికి గత ఏడాది జులై 30న పీఎస్‌ఎల్‌వీ-సి56 ప్రయోగాన్ని నిమిషం పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. దానికి మూడు నెలల ముందు ఏప్రిల్ 24న సింగపూర్‌కు చెందిన టెలియోస్-2 ఉపగ్రహ ప్రయోగంలోనూ ఇలా స్వల్ప జాప్యం చేయాల్సి వచ్చింది. గత ఏడాది అంతరిక్ష వ్యర్థాల బారి నుంచి తన ఉపగ్రహాలను రక్షించుకోవడానికి ఇస్రో 23 సార్లు విన్యాసాలు చేయాల్సి వచ్చిందట. గత 60 ఏళ్లలో అంతరిక్ష ప్రయోగాల వల్ల భూమి చుట్టూ రాకెట్, ఉపగ్రహ శకలాలు భారీగా పెరిగిపోయాయి. వీటిని ఎప్పటికప్పుడు అంతరిక్ష సంస్థలు పరిశీలిస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.