Business Idea: ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం.. ఇంట్లోనే మొదలు పెట్టొచ్చు.

ఉదయం లేవగానే ఉపయోగపడే వస్తువుల్లో స్క్రబర్‌ ఒకటి. పాత్రలను వాష్‌ చేయడానికి ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ స్క్రబర్స్‌ను ఉపయోగిస్తున్నారు. దీనినే వ్యాపారంగా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ఉండి ఈ స్క్రబర్‌ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. ఇందుకోసం ఏయే వస్తువులు కావాలి.? ఎంత పెట్టుబడి అవుతుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Business Idea: ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం.. ఇంట్లోనే మొదలు పెట్టొచ్చు.
Business Idea
Follow us

|

Updated on: May 02, 2024 | 4:40 PM

ఉద్యోగం చేసే వారు ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారం చేయడానికి ప్రణాళికలు రచిస్తుంటారు. ఇక మహిళలు అయితే ఉద్యోగం కంటే ఇంట్లోనే ఉంటూ ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటారు. అలాంటి వారి కోసమే ఓ మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఉదయం లేవగానే ఉపయోగపడే వస్తువుల్లో స్క్రబర్‌ ఒకటి. పాత్రలను వాష్‌ చేయడానికి ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ స్క్రబర్స్‌ను ఉపయోగిస్తున్నారు. దీనినే వ్యాపారంగా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ఉండి ఈ స్క్రబర్‌ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. ఇందుకోసం ఏయే వస్తువులు కావాలి.? ఎంత పెట్టుబడి అవుతుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

స్క్రబర్‌ బిజినెస్‌ను ప్రారంభించేందుకు పెద్ద పెద్ద మిషన్స్‌ అవసరం లేదు. స్క్రబర్‌ ముక్కలను మార్కెట్లో పెద్ద మొత్తంలో విక్రయించే సంస్థలు ఉన్నాయి. వారి నుంచి కొనుగోలు పెద్ద మొత్తం ఒకేసారి కొనుగోలు చేసుకోవచ్చు. అనంతరం కేవలం మీకు నచ్చిన పేరుతో వాటిని ప్యాకేజీ చేసి దుకాణాల్లో విక్రయించుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లో మూడు రకాల స్క్రబర్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిలో బేసిక్‌ స్క్రబర్స్‌ ధర రూ. 1.25 గా ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసి తర్వాత మీ సొంత బ్రాండింగ్‌తో వాటిని కవర్స్‌లో ప్యాక్‌ చేయాలి. అనంతరం వాటిని ప్యాక్‌ చేసి దగ్గర్లోని దుకాణాల్లో మీరే విక్రయించొచ్చు.

ఒక్క స్క్రబ్బర్‌ను ప్యాక్‌ చేయడానికి అవసరమయ్యే కవర్‌ ధర 25 పైసలుగా ఉంటుంది. ఇక కవర్స్‌ను సీలింగ్ చేయడానికి ఒక చిన్న మిషన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. మొత్తం మీద ఒక్క స్క్రబ్బర్‌కు సుమారు రూ. 4 ఖర్చవుతుంది. దీనిని హోల్‌సేల్‌ మార్కెట్‌లో సేల్ చేసుకుంటే రూ. 7 నుంచి రూ. 8 వరకు విక్రయించుకోవచ్చు. ఈ లెక్కన రోజుకు కనీసం 100 అమ్ముడుపోయినా రూ. 400 సంపాదించొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..