TV9 Telugu

16 May 2024

రూ. 80వేలలో స్టన్నింగ్  ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 

ivoomi ఎలక్ట్రిక్‌ కంపెనీ ఈ స్కూటర్‌ను 2.1kWh, 2.5kWh బ్యాటరీ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ఈ స్కూటర్‌ను మొత్తం 8 కలర్స్‌లో తీసుకొచ్చారు.

ఇక స్కూటర్‌ ధర విషయానికొస్తే రూ. 89,999 ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌గా నిర్ణయించారు. ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో ఈ స్కూటర్‌పై కంపెనీ ఆఫర్‌ అందిస్తోంది.

 ఐవూమీ జీట్‌ఎక్స్‌ ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్ అనే అద్భుతమైన ఫీచర్‌ను అందించారు. బ్లూటూత్‌ కనెక్టివిటీతో స్కూట్‌లో కాల్స్‌ కూడా మాట్లాడుకోవచ్చు.

ఇక ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 170 కిలోమీటర్ల రేంజ్‌ మైలేజ్‌ ఇస్తుంది. స్క్రీన్‌పై మెసేజ్‌ నోటిఫికేషన్‌ సైతం వస్తుంది.

ఛార్జింగ్‌ విషయానికొస్తే ఈ స్కూటర్‌ 0 నుంచి 50 శాతం కేవలం రెండు గంటల్లోనే ఛార్జ్‌ అవుతుంది. ఈ స్కూటర్‌ గంటకు 65 కీలోమీటర్ల టాప్‌ స్పీడ్‌తో దూసుకుపోతుంది.

ఇందులో రిమూవబుల్‌ బ్యాటరీని అందించారు. అలాగే సీటింగ్‌కు స్టైలిష్‌గా ఇచ్చారు. హెల్మెట్‌ అనుగుణంగా బూట్ స్పీస్‌ను ఇచ్చారు. 

బ్యాటరీపై మూడేళ్ల వారంటీ అందిస్తున్నారు. అలాగే ఈ బ్యాటరీ 0 నుంచి 80 శాతం కేవలం 4 గంటల్లోనే అవుతుంది.

 ఇక ఈ స్కూటర్‌ను పలు బ్యాంకుల సహాయంతో ఈఎమ్‌ఐ రూపంలో కూడా సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ. 3253 చెల్లించి స్కూటర్‌ను పొందొచ్చు.