AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki: బ్రాండ్ ఒకటే.. ధర కూడా అంతే.. ఆ రెండు కార్ల మధ్య ఎందుకంత పోటీ?

Maruti Suzuki Swift vs Maruti Suzuki Baleno: మారుతీ సుజుకి కంపెనీ మొట్టమొదటి స్విఫ్ట్ కారును 2005లో దేశ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు స్విఫ్ట్ సరికొత్త వెర్షన్ 2024 విడుదలైంది. అదే కంపెనీకి చెందిన బాలెనో కూడా ధర పరంగా స్విఫ్ట్ కు చాలా దగ్గరగా ఉంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ రెండు కార్లలో తేడాలు, ప్రత్యేకతలను తెలుసుకుందాం.

Maruti Suzuki: బ్రాండ్ ఒకటే.. ధర కూడా అంతే.. ఆ రెండు కార్ల మధ్య ఎందుకంత పోటీ?
Maruti Suzuki Swift Vs Baleno
Madhu
|

Updated on: May 16, 2024 | 5:57 PM

Share

మారుతీ సుజుకి కంపెనీ మొట్టమొదటి స్విఫ్ట్ కారును 2005లో దేశ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు స్విఫ్ట్ సరికొత్త వెర్షన్ 2024 విడుదలైంది. అదే కంపెనీకి చెందిన బాలెనో కూడా ధర పరంగా స్విఫ్ట్ కు చాలా దగ్గరగా ఉంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ రెండు కార్లలో తేడాలు, ప్రత్యేకతలను తెలుసుకుందాం.

సరికొత్తగా..

మారుతీ సుజుకి స్విఫ్ట్ కారును సరికొత్త జనరేషన్ సెట్టింగ్ లతో అప్‌డేట్ చేశారు. బయట హెడ్ ల్యాంపులు, బంపర్ల నుంచి డోర్ హ్యాండిళ్ల వరకూ కొత్త ప్యానెళ్లు ఆకట్టుకుంటున్నాయి. అయితే బాలెనో కారు పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఈ రెండు కార్లలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ ఫాగ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టైల్‌మ్యాంప్‌లు ఉన్నాయి. బాలెనో కారు 16 అంగుళాలు, స్విఫ్ట్ 15 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తున్నాయి.

కొలతలు ఇవే..

కొలతల విషయానికి వస్తే స్విఫ్ట్ 3,860 మిమీ పొడవు, 1,735 మిమీ వెడల్పు, 1,520 మిమీ ఎత్తు కలిగి ఉంది. మరోవైపు బాలెనో 3,990 మిమీ పొడవు, 1745 మిమీ వెడల్పు,1500 మిమీ ఎత్తు ఉంది. కొత్త స్విఫ్ట్ కంటే బాలెనో 20 మిమీ తక్కువ ఎత్తులో ఉంటుంది.

ఆకట్టుకునేలా..

స్విఫ్ట్ లో కొత్త ఇంటీరియర్స్‌ అప్‌డేట్ చేశారు. దీనిలో సరికొత్త డ్యాష్‌బోర్డ్‌ ఆకట్టుకుంటుంది. 9 అంగుళాల టాబ్లెట్ స్టైల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బాగుంది. కలర్ ఎమ్ఐడీ స్క్రీన్‌తో పాటు కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. బాలెనోలో మాదిరిగానే ఎయిర్ కండిషనింగ్ నియంత్రణలు ఉన్నాయి. స్విఫ్ట్ ఆల్ బ్లాక్ ఇంటీరియర్ లో వస్తుంది. బాలెనోలో బ్లూ, బ్లాక్ కాంబినేషన్‌లో డ్యుయల్ టోన్ ఇంటీరియర్ ఏర్పాటు చేశారు. బాలెనో ఇంటీరియర్‌లో ఎక్కువ స్థలం కనిపిస్తుంది. దీని వీల్ బేస్ 2520 ఎమ్ఎమ్ కాగా, స్విఫ్ట్ వీల్ బేస్ 2450 ఎమ్ఎమ్ మాత్రమే. బాలెనోలో లాంగర్ బూట్‌ స్పేస్ 318L కాగా, స్విఫ్ట్ లో 265L మాత్రమే ఉంది. ఈ రెండింటిలో 9 అంగుళాల ఇన్ఫర్మేషన్ టచ్ స్క్రీన్‌ ఏర్పాటు చేశారు.

ఇంజిన్ సామర్థ్యం..

ఈ రెండు కార్లూ ఫీచర్ల పరంగా ఒకేలా ఉన్నప్పటికీ కొత్త స్విఫ్ట్ మాత్రం కొంచెం ఆకట్టుకుంటుంది. దీనిలో 1.2L ఎన్ఏ పెట్రోల్ మూడు సిలిండర్ Z-సిరీస్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఇది 80 బీహెచ్ పీ, 111.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు బాలెనోలో 1.2L ఎన్ఏ పెట్రోల్ నాలుగు సిలిండర్ కే-సిరీస్ ఇంజిన్ ఉంది. దీని నుంచి 88.5 బీహెచ్ పీ, 113 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి అవుతుంది. బాలెనో సీఎన్ జీ ఎంపికతో కూడా అందుబాటులో ఉంది. మారుతీ స్విఫ్ట్ కు మాత్రం లేదు.

ధరలు..

కొత్త మారుతీ స్విఫ్ట్ ప్రారంభ ధర 6.49 లక్షలు కాగా, బాలెనో రూ. 6.66 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ఇక Zxi+AGS మోడల్ స్విఫ్ట్ కారు రూ.9.49 లక్షలు కాగా, బాలెనో ఆల్ఫా AGS రూ. 9.88 లక్షలకు లభిస్తున్నాయి. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..