ట్రైన్ మొత్తం బుక్ చేసుకుంటే.. ఎంత ఖర్చవుతుందో తెలుసా.? అస్సలు ఊహించి ఉండరు.. 

16-05-2024

Ravi Kiran

సాధారణంగా మనం ఎప్పుడైనా ట్రైన్‌లో దూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు.. స్లీపర్ లేదా థర్డ్ ఏసీ కోచ్‌లలో టికెట్ బుక్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ కంగారుగా బయల్దేరితే.. జనరల్ బోగీలో రష్‌లో కిందా.. పైనా.. పడుతూ ప్రయాణం చేస్తాం. 

స్లీపర్ లేదా థర్డ్ ఏసీలో ప్రయాణం..

మొత్తం రైలు లేదా కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకునే వెసులుబాటు మనకుంది. ఒకే కుటుంబానికి చెందినవారు, విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్.. టూర్ వెళ్తున్నప్పుడు.. రైలులో ఒక బోగీని అవసరముంటే మొత్తం రైలును కూడా బుక్ చేయొచ్చు. 

రైలు లేదా కోచ్ బుక్ చేసుకోవచ్చా?

ఈ తరహ బుకింగ్‌ను ఫుల్ టారిఫ్ రేట్(FTR) బుకింగ్ అంటారు. ఎఫ్‌టీఆర్ సేవల కింద, ఒక కోచ్‌ లేదా మొత్తం ట్రైన్‌ బుక్ చేసుకునే అవకాశం ఉంది. 

ఫుల్ టారిఫ్ రేట్ బుకింగ్ ఎలా..

దీనికి ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేయాలి. ముందుగా https://www.ftr.irctc.co.in/ftr/  లాగిన్ అవ్వాలి.

FTR వెబ్ సైట్ ఇదే.. 

ముందుగా ఈ వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీరు మొత్తంగా రైలును బుక్ చేయాలనుకుంటున్నారా? లేదా ఏ బోగీని బుక్ చేసుకోవాలనుకుంటున్నారో.? అనే ఎంపికను ఎంటర్ చేయాలి. 

కోచ్ లేదా ట్రైన్ బుక్ చేసుకోండిలా

ఆపై వెబ్‌సైట్‌లో మీరు ఇవ్వాల్సిన కీలకమైన సమాచారాన్ని పూర్తి చేయాలి. చివరిగా అక్కడ డిస్‌ప్లే అయిన పేమెంట్‌ను కడితే.. మీ బుకింగ్ కంప్లీట్ అయినట్టే.

చివరిగా పేమెంట్ ఆప్షన్..

మీరు ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 కమ్ 3 టైర్, ఏసీ చైర్ కార్, స్లీపర్ వంటి కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. 

ఏసీ కోచ్ లేదా స్లీపర్ క్లాస్..

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, మీరు ఒక కోచ్‌ని బుక్ చేయాలనుకుంటే 50 వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. 

రూ. 50 వేలు సెక్యూరిటీ డిపాజిట్..

మీరు ప్రయాణించే ప్రాంతం, దూరాన్ని బట్టి ఈ మొత్తం మారవచ్చు. అలాగే మీరు మొత్తం రైలును బుక్ చేయడానికి ప్లాన్ చేస్తే, మీరు మొత్తం రూ. 9 లక్షలు ఖర్చు చేయాలి. 

ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవడం ఎలా.!

కాగా, టూర్ ప్లాన్ చేసుకునేవారు ప్రయాణానికి 30 రోజుల నుంచి 6 నెలల ముందుగానే కోచ్ లేదా రైలును బుక్ చేసుకోవాలి.

ఎన్ని రోజుల ముందు బుక్ చేయాలి..