pakistan: సూపర్ పవర్ గా భారత్.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
పాకిస్థాన్‌లోని అతివాద ఇస్లామిక్ నేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును ప్రశంసించారు. పరోక్షంగా మన దేశం గురించి ఆయన ప్రస్తావించారు. పొరుగు దేశంతో పాక్‌ను పోల్చుకుంటే రెండూ ఒకే రోజు స్వాతంత్ర్యం పొందాయి.. కానీ, నేడు భారత్ సూపర్ పవర్ కావాలని కలలు కంటుందనీ.. తామేమో దివాలా తీయకుండా ఉంటే చాలని ప్రయత్నిస్తున్నామని పాక్ ఆర్థిక పరిస్థితిపై వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్‌లోని అతివాద ఇస్లామిక్ నేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును ప్రశంసించారు. పరోక్షంగా మన దేశం గురించి ఆయన ప్రస్తావించారు. పొరుగు దేశంతో పాక్‌ను పోల్చుకుంటే రెండూ ఒకే రోజు స్వాతంత్ర్యం పొందాయి.. కానీ, నేడు భారత్ సూపర్ పవర్ కావాలని కలలు కంటుందనీ.. తామేమో దివాలా తీయకుండా ఉంటే చాలని ప్రయత్నిస్తున్నామని పాక్ ఆర్థిక పరిస్థితిపై వ్యాఖ్యానించారు. తమ దేశం దివాలా తీయకుండా ఉండేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థను వేడుకుంటున్నామన్నారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవల ఇదే విధంగా భారత్ అభివృద్ధిని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. ఓ వైపు భారత్ చంద్రయాన్‌లు, జీ20 సమావేశాలు జరుపుతుంటే.. పాక్ మాత్రం ప్రపంచం ముందు అయ్యా, బాబూ అని అడుక్కుంటోందన్నారు.
భారత్ వలే అభివృద్ధిని పాక్ ఎందుకు సాధించలేకపోయిందని అన్నారు. దీనికి బాధ్యులు ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్‌కు మరో 1.1 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎగ్జిక్యూటివ్ బోర్డు తాజాగా ఆమోదముద్ర వేసింది. 3 బిలియన్ డాలర్ల ప్యాకేజీపై పాకిస్తాన్, ఐఎంఎఫ్ మధ్య జరిగిన ఒప్పందం ఈ నెలతో ముగియనుంది. ఈ క్రమంలోనే చివరి విడతగా రుణాన్ని మంజూరు చేసేందుకు అంగీకారం లభించింది. ఒప్పందంలో భాగంగా ఇప్పటికే పాక్ రెండు విడతల్లో 1.9 బిలియన్ డాలర్లను అందుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.