Kashmir Rains: కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..

జమ్ముకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో కుంభవృష్టి కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదలు పోటెత్తాయి. చోగల్‌ గ్రామం పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకుపోయింది. ఆ గ్రామంలోని వీధుల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. దాంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల ఇళ్లలోకి కూడా వరద నీరు చేరింది.

Kashmir Rains: కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..

|

Updated on: May 02, 2024 | 12:11 PM

జమ్ముకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో కుంభవృష్టి కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదలు పోటెత్తాయి. చోగల్‌ గ్రామం పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకుపోయింది. ఆ గ్రామంలోని వీధుల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. దాంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల ఇళ్లలోకి కూడా వరద నీరు చేరింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. జమ్ము కశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. బారాముల్లా, కిష్త్వార్, రియాసి జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమయ్యాయి.

కిష్త్వార్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా 12 ఇళ్లు దెబ్బతిన్నాయి. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రెస్క్యూ టీమ్‌ అప్రమత్తమైంది. దీంతో కశ్మీర్‌లో పాఠశాలలను మూసివేశారు. కశ్మీర్‌లో జరగాల్సిన ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష వాయిదా పడింది. జమ్ము-శ్రీనగర్ హైవేలోని శిథిలాలు తొలగించే వరకు ఈ రహదారిపై ‍ప్రయాణాలు సాగించవద్దని అధికారులు ప్రయాణికులకు సూచించారు. భారీ వర్షాల నేపధ్యంలో కిష్త్వార్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రియాసిలోని దోడా, రాంబన్, గులాబ్‌గఢ్‌లలో నదులు, వాగుల్లో నలుగురు కొట్టుకుపోగా, వారిలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం తదితర ఘటనల్లో12 మంది చిన్నారులతో సహా 22 మంది గాయపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
రోజూ పెరుగు తింటే.. ఆ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు..
రోజూ పెరుగు తింటే.. ఆ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు..
నెలకు రూ. 40 వేలు సంపాదన.! ఈ వ్యాపారం గురించి తెలిస్తే..
నెలకు రూ. 40 వేలు సంపాదన.! ఈ వ్యాపారం గురించి తెలిస్తే..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే