Mehreen Pirzada: తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!

హీరోయిన్ మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంది. ఈ మేరకు తాను తీసుకున్న నిర్ణయం మీద ఆమె ఓ పోస్ట్ పెట్టింది. గత రెండేళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోందని, ఈ విషయాన్ని చెప్పాలా? వద్దా? అన్న ఆలోచన ఉన్నట్లు రాసుకొచ్చింది. ఆల్రెడీ ఈ ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఉపాసన, మృణాల్ ఠాకూర్ స్పందించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మెహరీన్ కూడా ఇదే పద్దతిని అనుసరించింది.

Mehreen Pirzada: తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!

|

Updated on: May 02, 2024 | 2:22 PM

హీరోయిన్ మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంది. ఈ మేరకు తాను తీసుకున్న నిర్ణయం మీద ఆమె ఓ పోస్ట్ పెట్టింది. గత రెండేళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోందని, ఈ విషయాన్ని చెప్పాలా? వద్దా? అన్న ఆలోచన ఉన్నట్లు రాసుకొచ్చింది. ఆల్రెడీ ఈ ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఉపాసన, మృణాల్ ఠాకూర్ స్పందించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మెహరీన్ కూడా ఇదే పద్దతిని అనుసరించింది. ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియకు వెళ్లాలా? వద్దా? అని చాలా ఆలోచించాననీ తన మనసును సిద్దం చేయడానికి 2 సంవత్సరాలు పట్టిందని పోస్ట్‌లో రాసింది. చివరికి తాను దీన్ని ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అంది. వ్యక్తిగతమైన విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తే తన లాంటి చాలా మంది మహిళలు ఉన్నారనీ.. వారు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? లేదా బిడ్డను కనాలి? అని ఇంకా నిర్ణయించుకుని ఉండరనీ అయితే ఫ్యూచర్ కోసం, భవిష్యత్తులో వచ్చే సంక్లిష్టతలను నివారించడానికి మహిళలంతా దీన్ని ఎంచుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పింది.

ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగిందనీ.. తల్లి కావాలనేది ప్రతీ మహిళ కల అని చెప్పుకొచ్చింది. వయసు అయిపోయిందన్న కారణంతో ఆ కోరికను చంపుకోలేమనీ ఈ ప్రాసెస్ ఛాలెంజింగ్‌గా అనిపించిందనీ.. ముఖ్యంగా సూదులు, రక్తం, ఆసుపత్రులంటే ఫోబియా ఉన్న తన లాంటి వారికి ఇది మరీ పెద్ద ఛాలెంజ్ అని పేర్కొంది. తాను ఆసుపత్రికి వెళ్లిన ప్రతీసారీ మూర్ఛపోతుండేదాన్ననీ.. హార్మోన్ల ఇంజెక్షన్ల వల్ల కలిగే నిరంతర మానసిక గందరగోళం అంత సులభం కాదనీ.. కానీ ఇదంతా వర్తేనా? అని అడిగితే మాత్రం కచ్చితంగా యస్ అంటానంది. మహిళలు ఏది చేయాలని ఎంచుకున్నా, అది తమ కోసం మాత్రమే చేయాలి అంటూ చెప్పుకొచ్చింది మెహరీన్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు