Naga Chaitanya: నాగ చైతన్యకు జోడీగా క్రేజీ హీరోయిన్.. మరో హిట్ గ్యారెంటీ అంటున్న ఫ్యాన్స్
తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ సినిమాతో నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు చైతూ.

అక్కినేని అందగాడు నాగ చైతన్య ఒకొక్క సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ విజయాలను అందుకుంటున్నారు. రీసెంట్ గా నాగ చైతన్య తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతకు ముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత వరుసగా డిజాస్టర్స్ అందుకున్నాడు. ఇక చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో తండేల్ రాజుగా అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు నాగ చైతన్య నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి :నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.. అలాంటివి పట్టించుకోనంటున్న టాలీవుడ్ సింగర్
నాగ చైతన్య తన నెక్ట్స్ సినిమా కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు నాగచైతన్య 24 అని వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తాజాగా హీరోయిన్ ను ఫిక్స్ చేశారని తెలుస్తుంది. నాగచైతన్య 24లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. ఇక మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్.. ఇదెక్కడి అరాచకం రా సామి..! ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి
లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాంలాంటి భారీ హిట్స్ అందుకుంది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది నాగ చైతన్య సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 14న మొదలు కానుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు..
ఇది కూడా చదవండి : పర్మిషన్ లేకుండా రేప్ సీన్ షూట్.. కట్ చేస్తే హీరోపై కేసు పెట్టిన స్టార్ హీరోయిన్
View this post on Instagram
