- Telugu News Photo Gallery Cinema photos New music directors are putting tension on Thaman and Anirudh
తమన్, అనిరుధ్‌ను టెన్షన్ పెడుతున్న కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్.. ఎవరంటే ?
ఏ రంగంలో అయినా మోనోపలి మంచిది కాదు. అందుకే ఫామ్‌లో ఉన్న వాళ్లకు చెక్ పెట్టేందుకు కొత్త టాలెంట్ వస్తుంటూనే... కాంపిటీషన్ ఉంటుంది. ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద మ్యూజిక్ డైరెక్టర్స్ విషయం లో ఇలాంటి కాంపిటీషనే కనిపిస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న సంగీత దర్శకులకు పోటీగా... కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి.
Updated on: Apr 09, 2025 | 7:45 PM

నిన్నమొన్నటి వరకు సౌత్‌లో సంగీత దర్శకుడు అంటే తమన్, దేవీ శ్రీ ప్రసాద్, అనిరుధ్ ఇలా నాలుగైదు పేర్లే వినిపించేవి. స్టార్ హీరోల నుంచి యంగ్ జనరేషన్ వరకు, భారీ బడ్జెట్ నుంచి చిన్న సినిమా వరకు జానర్ ఏదైనా సినిమా ఏదైనా వీళ్లే ట్యూన్స్ ఇచ్చేవారు.

మధ్యలో ఒకరిద్దరు సంగీత దర్శకుల పేర్లు వినిపించినా.. మెయిన్ స్ట్రీమ్‌లో మాత్రం వీళ్లే ఫోకస్ అయ్యేవారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మ్యూజిక్ వరల్డ్‌లోకి కొత్త నీరు వస్తోంది.

ఈ మధ్య పెద్దగా ఫామ్‌లో కనిపించని రెహమాన్ లాంటి సీనియర్స్ మళ్లీ స్పీడు పెంచారు. పెద్ది టీజర్‌తో మరోసారి తన మార్క్ చూపించారు రెహమాన్. ఈ టీజర్ 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయటం వెనుక రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అయ్యింది.

సిల్వర్ స్క్రీన్ మీద కొత్తగా ఫ్లాష్ అవుతున్న మరో ఇంట్రస్టింగ్ నేమ్ సాయి అభయంకర్. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా... ఈ యంగ్ మ్యూజిషియన్ పేరు కోలీవుడ్ సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది.

బెంజ్, సూర్య 45 సినిమాలతో ప్రదీప్ రంగనాథన్ నెక్ట్స్ మూవీకి కూడా సాయి అభయంకరే సంగీతమందిస్తున్నారు. ఇలా కొత్త పేర్లు తెర మీదకు వస్తుండటంతో సీనియర్ మ్యూజిషియన్స్ కూడా మళ్లీ అలెర్ట్ అవుతున్నారు.




