- Telugu News Photo Gallery Cinema photos Tamannaah Bhatia looks special in a red dress at the Odela 2 trailer release event
కొప్పున గులాబీలు..నొదుట పెద్ద బొట్టు..తమన్నా లేటెస్ట్ ఫొటోస్ చూశారా..
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక ఇటీవల ఈ బ్యూటీ తన ప్రియుడు విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పిందంటూ అనేక వార్తలు వస్తున్న క్రమంలో ఈ అమ్మడు మాత్రం వరసగా ఫొటో షూట్స్ చేస్తూ తన హాట్ అండ్ క్యూట్ ఫొటోస్ తో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో పెద్ద బొట్టుతో చాలా అందంగా రెడీ అయ్యింది ఈ బ్యూటీ. ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Apr 09, 2025 | 8:16 PM

శ్రీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ తమన్నా. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమా అంతగా గుర్తింపు తీసుకరానప్పటికీ, హాప్పీడేస్ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ చిన్నది.

తర్వాత 100% లవ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత వరసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాకంఉడా, తన గ్లామర్ తో టాలీవుడ్ నే షేక్ చేసింది ఈ అమ్మడు.

ఇక ఈ మధ్య తెలుగులో తమన్నాకు అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చెక్కేసి, అక్కడే నిర్మాత విజయ్ వర్మతో ప్రేమలో పడింది, త్వరలో పెళ్లి చేసుకుంటారు అనుకునే సమయానికి వీరు బ్రేకప్ చెప్పుకొని అందరికీ షాకిచ్చారు.

ఇక ప్రస్తుతం ఒదేల 2 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ బ్యూటీ. దీంతో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయ్యింది. అక్కడ రెడ్ డ్రెస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

రెడ్ కలర్ అవుట్ ఫిట్ ధరించి, కొప్పున గులాబీ పూలను పెట్టుకొని, నుదిటిపై పెద్ద బొట్టుతో సరికొత్తగా కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



