మరోసారి వార్తల్లో నిలిచిన బాలకృష్ణ తనయుడు.. త్వరలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ అంటూ ..

ప్రస్తుతం వెండితెరపై సీనియర్ హీరోల వారసులు దూసుకుపోతున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు తమ వారసులు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక సీనియర్ హీరో

  • Rajitha Chanti
  • Publish Date - 4:39 pm, Sat, 23 January 21
మరోసారి వార్తల్లో నిలిచిన బాలకృష్ణ తనయుడు.. త్వరలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ అంటూ ..

ప్రస్తుతం వెండితెరపై సీనియర్ హీరోల వారసులు దూసుకుపోతున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు తమ వారసులు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక సీనియర్ హీరో నందమూరీ బాలకృష్ణ తనయుడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ విషయం పై ఎలాంటి స్పష్టత లేదు. అయితే అటు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు బాలకృష్ణ మంచి కథ, దర్శకుడి కోసం ప్రణాళికాలు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. తాజాగా మరోసారి మోక్షజ్ఞ వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త ఫిల్మ్ నగర్లో వినిసిస్తోంది.

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10. అయితే ఆ రోజు మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా ప్రారంభం కాబోతున్నందని టాక్ వినిపిస్తోంది. ఇప్పిటికే ఈ చిత్రానికి సంబంధించిన డైరెక్టర్‏ను కూడా ఫిక్స్ చేశారట. అతనేవరో కాదు మోక్షజ్ఞ సినిమాను డైరెక్ట్ చేయబోయేది టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అని సమాచారం. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. మరీ నిజంగానే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయబోయేది పూరీ జగన్నాథా ? లేదా ? అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read:

RRR Movie Update: దర్శకదీరుడికి షాక్ ఇచ్చిన ఐరిష్ నటి.. ఆనందంలో అభిమానులు.. షాక్‏లో చిత్రయూనిట్..

ప్రభుదేవాతో జోడీ కట్టేందుకు సిద్ధమైన ‘చందమామ’ బ్యూటీ.. రొమాంటిక్ కామెడీగా రాబోతున్న..