Movie Review: నవీన్ చంద్ర ‘సూపర్ ఓవర్’ ఇంట్రెస్టింగ్ కథే .. బెట్టింగులు, థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన సినిమా..

లాక్‏డౌన్ అనంతరం ఇటీవలే థియేటర్లు తెరుచుకున్నాయి. అయినా కానీ ఓటీటీలో రిలీజ్ అవుతన్న సినిమా సంఖ్య మాత్రం తగ్గడంలేదు. తాజాగా హీరో నవిన్ చంద్ర, కలర్ ఫోటో ఫేమ్ చాందీని చౌదరి

Movie Review: నవీన్ చంద్ర 'సూపర్ ఓవర్' ఇంట్రెస్టింగ్ కథే .. బెట్టింగులు, థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన సినిమా..
Follow us

|

Updated on: Jan 23, 2021 | 9:13 PM

చిత్రం: సూపర్‌ ఓవర్‌ తారాగణం: నవీన్‌ చంద్ర, చాందినీ చౌదరి, రాకేందుమౌళి, ప్రవీణ్‌ నిర్మాత: సుధీర్‌ వర్మ దర్శకత్వం: ప్రవీణ్‌ వర్మ ఓటీటీ వేదిక: ఆహా విడుదల తేది : జనవరి 22, 2021

లాక్‏డౌన్ అనంతరం ఇటీవలే థియేటర్లు తెరుచుకున్నాయి. అయినా కానీ ఓటీటీలో రిలీజ్ అవుతన్న సినిమాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. తాజాగా హీరో నవిన్ చంద్ర, కలర్ ఫోటో ఫేమ్ చాందీని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘సూపర్ ఓవర్’ సినిమా కూడా ఆహాలో విడుదైల సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ సినిమకు సంబంధించిన ప్రతి విషయం ఆసక్తిని రేకిత్తిస్తూ వస్తుంది. తాజాగా విడుదలైన సినిమా గురించి తెలుసుకుందాం. క్రికెట్ బెట్టింగ్, హవాలా నేపథ్యంలో మనిషికి డబ్బు కోసం మనిషి ఎంత దూరం వెళతాడనేది ఈ సినిమా కథాంశం.

స్టోరీ..

కాశీ (నవీన్‌ చంద్ర), మధు (చాందినీ చౌదరి), వాసు (రాకేందు మౌళి).. ముగ్గురూ చిన్నప్పటి స్నేహితులు. ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ కాశీ సులువుగా డబ్బులు సంపాదించేందుకు క్రికెట్ బెట్టింగ్‌కు దిగుతాడు. మిగతా ఇద్దరు స్నేహితులు కూడా కాశీని సమర్థిస్తారు. అయితే అనుకోకుండా కాశీ కోటీ 70 లక్షలు గెలుస్తాడు. ఆ డబ్బులు తీసుకొని, కష్టాలు తీర్చుకోవాలని ముగ్గురూ రాత్రివేళ బయల్దేరతారు. ఆ రాత్రి మొదలుకొని తెల్లవారే లోపల అసలు ట్విస్టులు, కష్టాలు మొదలవుతాయి. ఈ సమయంలో ఏం జరిగిందనేదే కథ.

ఎవరు ఎలా చేశారంటే..

ఈ సినిమాలో నటీనటులందరూ తమ పాత్రలలో జీవించేశారు అని చెప్పుకోవచ్చు. ముగ్గురు స్నేహితుల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సీరియస్ లుక్‏తో నవీన్‌ చంద్ర ఇందులో కనిపిస్తుండగా..తెలుగమ్మాయి చాందిని మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఇక ప్రతి విషయానికి అనుమానపడే పాత్రలో రచయిత వెన్నెలకంటి కుమారుడు రాకేందుమౌళి వినోదాన్ని పంచుతారు. కమెడియన్‌ ప్రవీణ్, అజయ్‌ సహా ఈ సినిమాలో వీళ్ళ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ఇక సినిమా చూస్తున్నంతసేపు ఆసక్తికరంగా తర్వాత జరగబోయేది ఏంటీ అనే ఇంటెన్షన్‏ను ప్రేక్షకులకు కల్పించారు.

మూవీ అనాలసిస్..

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మాత్రం ఒక బలమనే చెప్పుకోవాలి. అలాగే దర్శకుడు ప్రవీణ్ వర్మ ఈ మూవీ ఎంత కష్టపడి ఇలా తీశారనేది సినిమా చూస్తేనే చెప్పుకోవచ్చు. షూటింగ్ చివరిదశలో ఉన్నప్పుడు ఈ చిత్ర దర్శకుడు కారు యాక్సిడెంట్‏కు చనిపోయారు. దీంతో ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పని ఇచ్చిన స్వామిరారా, సుధీర్ వర్మ్ పోస్ట్ ప్రొడక్షన్ చేశారు. ఇక సస్సెన్స్ థ్రిల్లర్‏గా ఈ సినిమా కొనసాగింది. అలాగే ఈ సినిమాను సికింద్రాబాద్ మోండా మార్కెట్, తదితర ప్రాంతాల్లో రాత్రివేళల్లో తీశారు. ఈ చిత్రానికి థ్రిల్లర్ సంగీతాన్ని సన్నీ చాలా బాగా ఇచ్చారు. అంతేకాకుండా ఎడిటింగ్ కూడా స్టోరీ వేగంగా ముందుకు కదిలేలా చేశారు. ఈ సినిమాతో మరోసారి ఓటీటీల హావా పెరిగేల కనిపిస్తోంది. కొన్ని సందర్బాలలో ప్రేక్షకులకు కమెడీని అందించారు. ఇక ఈ సినిమా గంటన్నరా కొనసాగుతుండగా.. ప్రేక్షకులకు మాత్రం ఆ సమయం ఎలా గడిచిందనేది తెలియనంత ఆసక్తికరంగా ఈ మూవీ సాగిందనే చెప్పుకోవాలి. మొత్తానికి సూపర్ ఓవర్ సినిమా.. సూపర్ అనే చెప్పుకోవాలి.

చివరిగా.. ‘సూపర్ ఓవర్’.. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్..