అరుదైన ఘనత సాధించిన సమంత.. ఆ క్రెడిట్ దక్కించున్న తొలి భారతీయ నటిగా అక్కినేని వారి కోడలు..

 టాలీవుడ్‏లో టాప్ హీరోయిన్‏లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత అక్కినేని అరుదైన ఘనత సాధించింది. అదేంటంటే ట్విట్టర్ ఎమోజీలో స్థానాన్ని సొంతం చేసుకుంది.

  • Rajitha Chanti
  • Publish Date - 4:11 pm, Sat, 23 January 21
అరుదైన ఘనత సాధించిన సమంత.. ఆ క్రెడిట్ దక్కించున్న తొలి భారతీయ నటిగా అక్కినేని వారి కోడలు..

Actress Samantha: టాలీవుడ్‏లో టాప్ హీరోయిన్‏లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత అక్కినేని అరుదైన ఘనత సాధించింది. అదేంటంటే ట్విట్టర్ ఎమోజీలో స్థానాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటిగా సామ్ నిలిచింది. ఇక ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

సమంత తొలిసారి నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ . గతంలో మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‏కు ఇది కొనసాగింపు. ఈ సిరీస్ ఫిబ్రవరి 12న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో ఇది స్ట్రీమింగ్ కానుంది. అయితే ట్విట్టర్‏తో కలిసి అమెజాన్ ప్రైమ్ సమంత పాత్రని ఎమోజీగా రూపొందించి విడుదల చేసింది. దీంతో సమంత ఆనందం వ్యక్తం చేసింది. నిజంగానా అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేసింది. ప్రస్తుతం ది ఫ్యామిలీ మ్యాన్-2 హ్యష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‏లో ఉంది.

Also Read:

Krack Movie : కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘క్రాక్’.. పదిరోజులు దాటినా తగ్గని మాస్ రాజా సినిమా జోరు

Acharya Movie : ‘ఆచార్య’ సెట్‌‌‌‌‌లో అడుగు పెట్టనున్న మరో హీరోయిన్.. చరణ్‌‌‌కు జోడీగా బుట్టబొమ్మ..?