AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10th Class Evaluation 2026: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం తేదీలు వచ్చేశాయ్‌.. ఎప్పట్నుంచంటే?

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మరో నెల రోజుల్లో మొదలవనున్నాయి. ఈ క్రమంలో పాఠశాల విద్యామండలి పరీక్షల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు విద్యార్ధులు ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. మార్చి 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు..

10th Class Evaluation 2026: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం తేదీలు వచ్చేశాయ్‌.. ఎప్పట్నుంచంటే?
10th Class Public Exams 2026 Answer Sheets Evaluation
Srilakshmi C
|

Updated on: Feb 13, 2026 | 7:06 AM

Share

అమరావతి, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మరో నెల రోజుల్లో మొదలవనున్నాయి. ఈ క్రమంలో పాఠశాల విద్యామండలి పరీక్షల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు విద్యార్ధులు ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. మార్చి 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం అవుతాయి. మర్చి 30వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయి. అనంతరం ఏప్రిల్ 4వ తేదీ నుంచే జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఏప్రిల్‌ 13వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మూల్యాంకన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా విద్యాధికారులకు పలు సూచనలు చేసింది. మూల్యాంకనంపై రాష్ట్ర ఉపాధ్యాయులు, అధికారులకు ఏప్రిల్ 4వ తేదీన నిర్వహించే అవగాహన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌ పరీక్ష తేదీ మారిన నేపథ్యంలో కొత్త టైం టేబుల్ ఈ కింది విధంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 పూర్తి టైమ్‌టేబుల్ ఇదే..

  • మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 21న ఇంగ్లిష్ పరీక్ష (మార్చి 20 నుంచి 21కి పరీక్ష తేదీ మారింది)
  • మార్చి 23న మ్యాథమెటిక్స్‌
  • మార్చి 25న ఫిజికల్ సైన్స్
  • మార్చి 28న బయాలజికల్ సైన్స్ పరీక్ష
  • మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్షతో ప్రధాన పరీక్షలు ముగుస్తాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.