ఆకట్టుకుంటున్న ‘నాట్యం’ ఫస్ట్ లుక్ పోస్టర్.. తొలిసారి వెండితెరపై నటించనున్న కూచిపూడి డాన్సర్..

ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యా రాజు తొలిసారిగా నటిగా నటిస్తున్న చిత్రం 'నాట్యం'. ఈ సినిమాను నిశ్రింకల ఫిలింస్ బ్యానర్ పై రేవంత్ కోరుకొండ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో

ఆకట్టుకుంటున్న 'నాట్యం' ఫస్ట్ లుక్ పోస్టర్.. తొలిసారి వెండితెరపై నటించనున్న కూచిపూడి డాన్సర్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 23, 2021 | 3:50 PM

Natyam Movie Update: ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యా రాజు తొలిసారిగా నటిగా నటిస్తున్న చిత్రం ‘నాట్యం’. ఈ సినిమాను నిశ్రింకల ఫిలింస్ బ్యానర్ పై రేవంత్ కోరుకొండ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ, బేబీ దీవానా కీలక పాత్రల్లో నటిస్తుండగా.. నాట్యం కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏ను హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఇక ఈ పోస్టర్‏లో నటి సంధ్యారాజు నటరాజ విగ్రహం ముందు నాట్యం చేస్తున్న స్టిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే సంధ్యారాజు నాట్య మయూరిగా కనపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఓ నర్తకి కథతో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

Also Read:

Pushpa Movie Update: పాన్ ఇండియా లెవల్లో ‘పుష్ప’ ? బన్నీ ప్లాన్ మాములుగా లేదుగా..

రామ్ కొత్త సినిమా కోసం ఆ మాస్ డైరెక్టర్ ? మళ్లీ యాక్షన్ వైపే అడుగులేస్తున్న యంగ్ హీరో..