Pushpa Movie Update: పాన్ ఇండియా లెవల్లో ‘పుష్ప’ ? బన్నీ ప్లాన్ మాములుగా లేదుగా..

టాలీవుడ్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‏లో రూపొందుతున్న సినిమా 'పుష్ప'. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో

Pushpa Movie Update: పాన్ ఇండియా లెవల్లో 'పుష్ప' ? బన్నీ ప్లాన్ మాములుగా లేదుగా..
Follow us

|

Updated on: Jan 22, 2021 | 9:56 PM

టాలీవుడ్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‏లో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‏గా కనిపించబోతున్నాడు. ఇక ఇందులో హీరోయిన్ రష్మిక మందన గ్రామీణ యువతిగా కనిపించనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యం శెట్టి మీడియా బ్యానర్లపై నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమాను తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తామని ప్రకటించింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మొతం పది భాషల్లో విడుదల చేయనున్నరట. ఇందుకు కారణం లేకపోలేదు. గతేడాది బన్నీ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా ఏ రెంజ్‏లో హిట్ అయ్యిందో తెలిసిన సంగతే. అయితే ఆ సినిమాకు వచ్చిన క్రేజ్‏తో ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోందట. ఇప్పటికే తెలుగులో రామ్ నటించిన ‘రెడ్’ మూవీని 8 భాషల్లో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్నాయి.