వామ్మో హృతిక్ రోషన్ అన్ని వేల కోట్లకు వారసుడా !!

TV9 Telugu

25 April 2024

నెపోటిజం ..ఈ మాట ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది. చాలా సంవత్సరాల నుండి సినిమా రంగాన్ని వారి వారి వారసులు ఏలుతున్నారు.

చాలా మంది వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వారి టాలెంట్ నిరూపించుకుని వారికంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

ఒక వేళ వారు ఎంత వారసులైన టాలెంట్ లేనివారు రెండు మూడు సినిమాలకే బయటకు వెళ్ళిపోయారు. ఈ నెపోటిజం నార్త్ లో చాలా ఎక్కువగా ఉంది

ఇక ఈక్రమంలో ఇండియాన ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నెపో హీరో తన కష్టమీద వేల కోట్ల సంపాదించారు.  అతను ఎవరో కాదు  హృతిక్ రోషన్. 

హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ బాలీవుడ్‌లో దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. తండ్రి సహకారంతో సినిమాల్లోకి ఈజీగా ఎంట్రీ ఇచ్చాడు.

హృతిక్ అనేక  విజయాలు, అపజయాలు చూసి బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు.  ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

ఇక హృతి క్ రోషన్ ఆస్తుల విలువ 3100 కోట్లు మరియు హృతిక్.. దేశంలోని ఇతర సినిమా స్టార్ వారసుల కంటే ఎక్కువ సంపాదించడానికి ప్రధాన కారణం అతని వ్యాపారం.

అతను హెచ్‌ఆర్‌ఎక్స్ అనే స్పోర్ట్స్‌వేర్ కంపెనీని నడుపుతున్నాడు. 7300 కోట్ల విలువైన ఆ సంస్థ ద్వారా హృతిక్ రోషన్ కోట్లాది ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.