కరువైన ఆఫర్లు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న శ్రీలీల..

TV9 Telugu

25 April 2024

శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గత రెండు సంవత్సరాలుగా  తెలుగు ఇండస్ట్రీను ఒక ఊపు ఊపుతోంది.

క్యూట్ లుక్స్ తో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ కుర్రకారుకు కునుకులేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా వరుస పరాజయాలు ఈ బ్యూటీకి ఆఫర్లు కరువయ్యాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో తాజాగా  ఇండస్ట్రీ లో క్రేజీ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీలీల కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుందట.

తమిళంలోకి అరంగేట్రం చేస్తూ ఇద్దరు సీనియర్లతో కలిసి నటిస్తుందని తెలుస్తుంది. అందులో ఒకటి అజిత్‌ సినిమా అని తెలుస్తుంది.

అధిక్ రవి చంద్రన్‌ దర్శకత్వం లో  `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` అనే సినిమాని ప్రకటించారు. హీరోయిన్‌గా అజిత్‌, జాన్వీ కపూర్‌ పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది.

మరోవైపు కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ తో నటించబోతుందట. ఇందులో ఓ ఐటెమ్‌ సాంగ్‌ కోసం శ్రీలీలని అడుగుతున్నట్టు తెలుస్తుంది. మరీ ఈ బ్యూటీ ఓకే చెబుతుందా అనేది చూడాలి.