ఓటీటీలో ట్రెండ్ సెట్ చేస్తున్న చారి 111

TV9 Telugu

25 April 2024

తాజాగా వెన్నెల కిషోర్‌ హీరోగా మారి `చారి 111` చిత్రంలో నటించారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మంచి కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. 

జేమ్స్ బాండ్‌ స్టయిల్‌ లో ఈ సినిమాను తీసిన  ఆద్యంతం నవ్వులు పూయించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు అనే చెప్పాలి.

చారి 111 మార్చి 1న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఫర్వాలేదనిపించుకుంది. వెన్నెల కిశోర్‌తోపాటు మురళీ శర్మ, సత్య, తాగుబోతు రమేష్‌ల కామెడీకి మంచి ప్రశంసలు దక్కాయి. 

ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో నడుస్తుంది. థియేటర్లోకి వచ్చిన నెల రోజులకంటే ముందే ఓటీటీలోకి వచ్చిందీ మూవీ.

కామెడీ ఎంటర్టైనర్‌ జోనర్‌లో  చారి 111 మూవీ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఫ్యామిలీ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.

థియేటర్లో ఈ మూవీని ఫ్యామిలీ ఆడియెన్స్ చూడలేదు. దీంతో ఓటీటీలో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి వ్యూస్‌ రికార్డు స్థాయిలో నమోదు కావడం విశేషం. 

పెద్ద పెద్ద హీరోల సినిమాలు లాగా  `చారి 111` కి మంచి ఆదరణ దక్కుతుండటం మరో విశేషం. ఇప్పటికీ ఇది టాప్‌ 10లో రన్‌ అవుతుండటం విశేషం.