Radhe Shyam: రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియోను చూశారా.? 1970 కాలాన్ని పున సృష్టించిన తీరు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Radhe Shyam: రాధేశ్యామ్‌ సినిమా కోసం యావత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ప్రభాస్‌ (Prabhas) హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న..

Radhe Shyam: రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియోను చూశారా.? 1970 కాలాన్ని పున సృష్టించిన తీరు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Radhe Shyam Making Video
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 05, 2022 | 6:35 AM

Radhe Shyam: రాధేశ్యామ్‌ సినిమా కోసం యావత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ప్రభాస్‌ (Prabhas) హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాపై మూవీ లవర్స్‌ ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా (Corona) కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఎట్టకేలకు మార్చి 11న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్‌ వరుసగా ఈవెంట్స్‌ నిర్వహిస్తుంది. అలాగే తాజాగా రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌కు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి.

ఇదిలా ఉంటే ఈ క్రమంలో రాధేశ్యామ్‌ సినిమా మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో చూస్తుంటే రాధేశ్యామ్‌ సినిమా కోసం మేకర్స్‌ పడ్డ కష్టం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ‘సగా ఆఫ్‌ రాధేశ్యామ్‌’ పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో మేకర్స్‌ 1970 కాలం నాటి ఇటలీని పున సృష్టించిన తీరు అద్భుతంగా ఉంది. అంతేకాకుండా కరోనా కారణంగా యూరప్‌లో షూటింగ్ ఆగిపోవడంతో ఇండియాలో యూరప్‌ సెట్‌ వేసి మరీ చిత్రీకరించారు.

ఈ మేకింగ్ వీడియో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. రాధేశ్యామ్‌ కచ్చితంగా ప్రేక్షకులను మరో కొత్త లోకాలకు తీసుకెళుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. ఇక మంచు ప్రాంతాల్లో షూటింగ్ కోసం హెలికాప్టర్‌ల వినియోగం, భారీ సెట్టింగ్స్‌ సినిమా నిర్మాణం కోసం ఎంతలా ఖర్చు చేశారో చెప్పకనే చెబుతోంది. మరి అద్భుతంగా ఉన్న ఈ మేకింగ్ వీడియోను మీరూ ఓసారి చూసేయండి..

Also Read: Viral Video: కొంపముంచిన ఫోన్ స్క్రీన్.. గోతిలో పడ్డ యువకుడు.. వీడియో చుస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ అవుతున్న వీడియో..

Telangana: మహిళలకు గుడ్‌న్యూస్‌.. మార్చి 31 వరకు ఉచితంగా కంటి పరీక్షలు.. ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే..

AIIMS Jobs 2022: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు 2 లక్షలకు పైగా జీతంతో..