AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: డైరెక్టర్ ట్వీట్‏కు రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్ర.. ప్రభాస్ సినిమాకు సపోర్ట్ చేస్తామంటూ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్‏తో ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు.

Anand Mahindra: డైరెక్టర్ ట్వీట్‏కు రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్ర.. ప్రభాస్ సినిమాకు సపోర్ట్ చేస్తామంటూ..
Anand
Rajitha Chanti
|

Updated on: Mar 05, 2022 | 7:58 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్‏తో ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలలో ప్రాజెక్ట్ కే ఒకటి. ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Aswin) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తుంది. అలాగే కీలకపాత్రలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ – స్వప్న సినిమాస్ బ్యానర్లపై అశ్వనీత్ దత్ దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే శుక్రవారం డైరెక్టర్ నాగ్ అశ్విన్.. తన ట్వి్ట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమాకు సాంకేతిక సాయం కావాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రను కోరారు. ‘డియర్ ఆనంద్‌మహీంద్ర సార్ మేము అమితాబ్ బచన్, ప్రభాస్ మరియు దీపికలతో కలిసి ప్రాజెక్ట్ కే అనే భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి మించి అధునాతన టెక్నాలజీతో ఈ సినిమాకోసం వాహనాలను రూపొందిస్తున్నాం. ఒకవేళ మా కల నిజమైతే అది మన దేశానికి గర్వకారణం అని భావించాలి. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాం.. అందుకోసం మీ సాయం కావలి. ఇంజనీర్ల విషయంలో మాకు మీ సాయంకావాలి. మీ దగ్గర టాలెంటెడ్, ఇండియన్ టీమ్ ఇంజనీర్లు , డిజైనర్లు ఉన్నారు..వారి సాయం మాకు అవసరం. ఇలాంటి సినిమా ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించలేదు… భవిష్యత్తును రూపొందించడంలో మీరు మాకు సహాయం చేయగలిగితే సంతోషిస్తాను’ అంటూ ట్వీట్ చేశారు. తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ట్వీట్‏కు రిప్లై ఇచ్చారు ఆనంద్ మహీంద్రా.

నాగ్ అశ్విన్ ట్వీట్‏కు రిప్లై ఇస్తూ.. ఇంత అధ్భుతమైన అవకాశాన్ని ఎలా రిజెక్ట్ చేస్తాం నాగ్ అశ్విన్.. మా గ్లోబల్ ప్రొడెక్ట్ డెవలప్ మెంట్ చీఫ్ వేలు మహీంద్ర మీకు కావాల్సిన సహకారాన్ని అందిస్తారు. తమ ఇప్పటికే అధునాతన హంగులతో ఎక్స్ యూవీ 700 కారును రూపొందించారు అంటూ మహీంద్ర ట్వీట్ చేశారు. దీనికి నాగ్ అశ్విన్ సంతోషంగా తిరిగి రిప్లై ఇచ్చారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read: Radhe Shyam: రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియోను చూశారా.? 1970 కాలాన్ని పున సృష్టించిన తీరు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Pushpa: పుష్ప ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్‌ స్పెషల్‌ గిఫ్ట్‌.. బ్యాక్‌ టు బ్యాక్‌ డైలాగ్స్‌ అన్నీ ఒకే చోట..

Prabhas: ప్రభాస్‌ అంత సింపుల్‌గా ఉంటారని ఊహించలేదు.. డార్లింగ్‌పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్‌ హీరోయిన్‌..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..