Prabhas: ప్రభాస్‌ అంత సింపుల్‌గా ఉంటారని ఊహించలేదు.. డార్లింగ్‌పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్‌ హీరోయిన్‌..

Prabhas: ప్రభాస్‌ ఇప్పుడు ఈ పేరు ఓ సంచలనం. బాహుబలితో (Bahubali) ఒక్కసారిగా నేషనల్‌ స్టార్‌గా మారిన ప్రభాస్‌కు ప్రస్తుతం దేశమంతా అభిమానులు ఉన్నారు. ఆ మాటకొస్తే విదేశాల్లోనూ ప్రభాస్‌ అభిమానులను సంపాదించుకున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..

Prabhas: ప్రభాస్‌ అంత సింపుల్‌గా ఉంటారని ఊహించలేదు.. డార్లింగ్‌పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్‌ హీరోయిన్‌..
Prabhas
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 05, 2022 | 6:20 AM

Prabhas: ప్రభాస్‌ ఇప్పుడు ఈ పేరు ఓ సంచలనం. బాహుబలితో (Bahubali) ఒక్కసారిగా నేషనల్‌ స్టార్‌గా మారిన ప్రభాస్‌కు ప్రస్తుతం దేశమంతా అభిమానులు ఉన్నారు. ఆ మాటకొస్తే విదేశాల్లోనూ ప్రభాస్‌ అభిమానులను సంపాదించుకున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓవర్‌సీస్‌లో ప్రభాస్‌ సినిమాలకు వస్తున్న కలెక్షన్లే దీనికి ప్రత్యక్షసాక్ష్యంగా చెప్పొచ్చు. ప్రభాస్‌కు ఉన్న ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి బాలీవుడ్‌ అగ్ర దర్శకులు సైతం ఆయన వెంట పడుతున్నారంటేనే డార్లింగ్ క్రేజ్‌ ఎలా ఉందో అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్వ్తం ప్రభాస్‌ సొంతమని ఆయనతో చనువుగా ఉంటారు. ముఖ్యంగా సెట్స్‌లో ప్రభాస్‌ తోటీ నటీనటులతో గడిపే విధానానికి ఫిదా అవుతుంటారు. తోటీ కళాకారులకు ప్రభాస్‌ ఇచ్చే అతిథ్యానికి ఫిదా అవుతుంటారు.

ప్రభాస్‌పై తోటి యాక్టర్స్‌ ప్రశంసలు కురిపించడం సర్వసాధారణమైన విషయం. తాజాగా ఈ జాబితాలోకి మరో బాలీవుడ్‌ హీరోయిన్‌ చేరారు. ప్రభాస్‌ హీరోగా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా రాధేశ్యామ్‌. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా తల్లిగా బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ భాగ్యశ్రీ నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ మాట్లాడతుతూ ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

Bhagyasree Radhe Shyam

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రాధేశ్యామ్‌లో ప్రభాస్‌కు తల్లిగా నటించడం ఎంతో సంతోషిన్చింది. ప్రభాస్‌ చాలా గొప్ప నటుడు. ప్రభాస్‌కు ఎంతో క్రేజ్‌ ఉంది. అయితే వీటన్నింటినీ పక్కన పెట్టి ఆయన అందరితో ఎంతో సరదాగా ఉంటారు. మొదట రాధేశ్యామ్‌ సెట్‌లో ప్రభాస్‌ని చూసి, ఎలా పలకరించాలా అని అనుకుంటుండగా అతనే నా దగ్గరికి వచ్చారు. నా అభిమాని అంటూ ప్రభాస్‌ చెప్పడంతో షాక్‌ అయ్యాను. ఆయన అంత సింపుల్‌గా ఉంటారనీ, అంత చనువుగా మాట్లాడతారని ఊహించలేదు’ అంటూ ప్రభాస్‌ను ఆకాశానికెత్తేశారు.

Also Read: Viral Video: కొంపముంచిన ఫోన్ స్క్రీన్.. గోతిలో పడ్డ యువకుడు.. వీడియో చుస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: పిల్లే అయినా పులిలా వేటాడింది.. వీడియో చూస్తే అవాక్ అవ్వాల్సిందే..

Telangana: మహిళలకు గుడ్‌న్యూస్‌.. మార్చి 31 వరకు ఉచితంగా కంటి పరీక్షలు.. ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే..