Viral Video: కొంపముంచిన ఫోన్ స్క్రీన్.. గోతిలో పడ్డ యువకుడు.. వీడియో చుస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ అవుతున్న వీడియో..
ప్రస్తుత కాలంలో మొబైల్ లేనిదే గడవని పరిస్థితి నెలకొంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా మొబైల్‌కి బానిసలైపోతున్నారు. రోడ్డు మీద నడుస్తూ.. వాహనాలు నడుపుతూ కూడా మొబైల్ చూడటం ఆపడంలేదు. ఈ క్రమంలో వాహనంపై వెళ్లేటప్పుడే కాదు... నడుస్తూ మొబైల్ లో మాట్లాడటం,
ప్రస్తుత కాలంలో మొబైల్ లేనిదే గడవని పరిస్థితి నెలకొంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా మొబైల్‌కి బానిసలైపోతున్నారు. రోడ్డు మీద నడుస్తూ.. వాహనాలు నడుపుతూ కూడా మొబైల్ చూడటం ఆపడంలేదు. ఈ క్రమంలో వాహనంపై వెళ్లేటప్పుడే కాదు… నడుస్తూ మొబైల్ లో మాట్లాడటం, మొబైల్ స్క్రీన్ చూడటం కూడా డేంజరే అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఓ యువకుడు మొబైల్ చూసుకుంటూ గొయ్యిలో పడిపోవడం వైరల్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వైరల్ అవుతున్న ఈ వీడియలోని ఘటన టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగింది. ఓ యువకుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించకుండా… మొబైల్ స్క్రీన్ చూసుకుంటూ నడుస్తున్నాడు. అలా నడుచుకుంటూ అతను ఓ మాల్‌లోకి వెళ్లాడు. అక్కడ మాల్ సిబ్బంది పై అంతస్థు నుంచి కింది అంతస్థులోని స్టోరేజీ గదికి ప్యాక్ చేసిన కార్డ్ బోర్డ్ బాక్సుల్ని చేరవేస్తున్నారు. ఇందుకోసం వారు స్టోరేజీ గది సీలింగ్ కి ఉన్న కన్నాన్ని తెరిచి ఉంచారు. అటుగా వచ్చేవారంతా అది చూసుకుని.. ఆ కన్నంలో కాలు పెట్టకుండా జాగ్రత్తగా వెళ్తున్నారు. కానీ ఈ యువకుడు మాత్రం ఫోన్ చూసుకుంటూ అవేమీ పట్టించుకోకుండా వెళ్తూ.. కన్నంలో కాలు పెట్టాడు. అంతే ఒక్కసారిగా కింది అంతస్థులో కార్డ్ బోర్డ్ బాక్సులపై పడ్డాడు. ఆ తర్వాత వర్కర్లు పరుగున వచ్చి అతన్ని ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అక్కడి సీసీ టీవీలో రికార్డయిన ఈ దృష్యాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటనలో అతను బాక్సులపై పడ్డాడు కనుక సేఫ్‌గా బటయపడ్డాడు. అదే నేలపై పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఆ వచ్చే వ్యక్తిని అలర్ట్ చెయ్యాల్సిన బాధ్యత అక్కడున్నవారికి లేదా” అని ఓ యూజర్ ప్రశ్నించగా… “ఇది చూస్తుంటే నాకు సూపర్ మారియో గుర్తొచ్చింది” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

