AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHA OTT: మార్చి నెలంతా ఆహాలో సందడే సందడి.. ఇది నిజంగానే ఆహా అనిపించే క్యాలెండర్‌..

AHA OTT: ఓటీటీ రంగంలో సంచలనంలా దూసుకొచ్చింది తొలి తెలుగు ఓటీటీ (Telugu OTT) ప్లాట్‌ఫామ్‌ ఆహా. సరికొత్త టాక్‌ షోలు, సినిమాలతో డిజిటల్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోన్న ఆహా ఎంతో మంది అప్‌కమింగ్‌ మూవీ మేకర్స్‌కు సైతం మంచి ప్లాట్‌ఫామ్‌గా మారింది...

AHA OTT: మార్చి నెలంతా ఆహాలో సందడే సందడి.. ఇది నిజంగానే ఆహా అనిపించే క్యాలెండర్‌..
Aha Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 05, 2022 | 6:15 AM

AHA OTT: ఓటీటీ రంగంలో సంచలనంలా దూసుకొచ్చింది తొలి తెలుగు ఓటీటీ (Telugu OTT) ప్లాట్‌ఫామ్‌ ఆహా. సరికొత్త టాక్‌ షోలు, సినిమాలతో డిజిటల్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోన్న ఆహా ఎంతో మంది అప్‌కమింగ్‌ మూవీ మేకర్స్‌కు సైతం మంచి ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో చిన్న సినిమాలో ఆహా వేదికగా విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఇండియన్‌ ఐడల్‌ పేరుతో మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతీ శుక్రవారం ఆకట్టుకునే కంటెంట్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోంది ఆహా టీమ్‌. ఈ క్రమంలోనే మార్చి నెల మొత్తం ఆడియన్స్‌కు వీనుల విందు అందించేందుకు సిద్ధమైంది. ‘ఆహా అనిపించే క్యాలెండర్‌’ పేరుతో ఈ నెల ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, ఇతర ప్రోగ్రామ్స్‌ జాబితాను ప్రకటించింది.

ఇందులో భాగంగా ఆహా మార్చి నెలను సూపర్‌ హిట్ చిత్రం ‘డీజీ టిల్లు’తో ప్రారంభించింది. మార్చి 4వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. యూత్‌ను టార్గెట్‌ చేస్తూ ఫిబ్రవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆహాలో విడుదలై డిజిటల్‌ తెరపై కూడా సందడి చేస్తోంది. ఇక ఈ నెలలో ఆహాలో విడుదల కానున్న మరో సినిమా ‘కుబుల్‌ హై’. హైదరాబాద్ పాత బస్తీ నేపథ్యంలో జరిగే బాల్య వివాహాలు-అక్రమ రవాణాకు సంబంధించిన కథాంశంగా తెరకెక్కి ఈ సినిమా ఆహా వేదికగా ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆహా సమర్పణలో పింగిల్ ప్రణవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు ఆయనే సహ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇతర భాషల్లో మంచి విజయాలను అందుకున్న సినిమాలను తెలుగు ప్రేక్షకుల కోసం డబ్‌ చేస్తూ వస్తోన్న ఆహా తాజాగా మరో మలయాళ సినిమాను విడుదల చేయనుంది. జూన్‌ పేరుతో రానున్న ఈ సినిమా 2019లో మలయాళంలో సంచలన విజయం నమోదు చేసుకుంది. అహ్మద్‌ కబీర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 18న ఆహాలో విడుదల చేయనున్నారు.

ఔత్సాహిక గాయనీగాయకులను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో ఆహాలో ఇండియన్‌ ఐడల్‌ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు సంబంధించి తొలి ఆడిషన్స్‌ మార్చి 4, 5 తేదీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రతీ శుక్ర, శని వారాల్లో రాత్రి 9 గంటలకు కొత్త ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇక మార్చి 11, 12 తేదీల్లో థియేటర్‌ ఆడిషన్స్‌, మార్చి 18, 19 తేదీల్లో గ్రాండ్‌ ప్రీమియర్‌, మార్చి 25, 26 తేదీల్లో గాలా ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

Also Read: Viral Video: కొంపముంచిన ఫోన్ స్క్రీన్.. గోతిలో పడ్డ యువకుడు.. వీడియో చుస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ అవుతున్న వీడియో..

Ram Pothineni: మన ఎనర్జిటిక్ స్టార్ ఆ సినిమాలతో ఉత్తరాది ఊపేస్తాడా..?

Viral Video: పిల్లే అయినా పులిలా వేటాడింది.. వీడియో చూస్తే అవాక్ అవ్వాల్సిందే..