Ram Pothineni: మన ఎనర్జిటిక్ స్టార్ ఆ సినిమాలతో ఉత్తరాది ఊపేస్తాడా..?
పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలంటే... హీరోలకు వుండాల్సిన పారామీటర్స్ ఏంటి.. అనే విషయంలో ఎవరి లెక్క వాళ్లకుండొచ్చు. కానీ..
Ram Pothineni: పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలంటే… హీరోలకు వుండాల్సిన పారామీటర్స్ ఏంటి.. అనే విషయంలో ఎవరి లెక్క వాళ్లకుండొచ్చు. కానీ.. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని లెక్క మాత్రం వీళ్లందరి కంటే వేరేగా వుంది. ఇంకా మాట్లాడితే.. అయ్యామ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పాన్ ఇండియా హీరో అని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చే రేంజ్‌లో వున్నారు. ఇంతకూ ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా.. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ఖాతాలో మరో రేరెస్ట్ రికార్డు చేరిపోయింది. హిందీ డబ్బింగ్ సినిమాలకు 2 బిలియన్ల వ్యూస్ దాటిన వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియన్ హీరో రామ్. ఈవిధంగా నార్త్‌లో జబర్దస్త్‌గా కాలరెగరేసే ఛాన్సొచ్చింది ఈ రియల్ వారియర్‌కి.
తెలుగులో జయాపజయాలతో ప్రమేయం లేకుండా.. దాదాపుగా రామ్ సినిమాలన్నీ హిందీలో డబ్ అవడం కామన్. 2006లో వచ్చిన దేవదాసు నుంచి నిన్నమొన్నటి ఇస్మార్ట్ శంకర్ దాకా.. ఏకంగా 16 హిందీ వెర్షన్స్ యూట్యూబ్‌లో సూపర్‌హిట్టయినవే. వంద, రెండొందలు కాదు.. నేను-శైలజ, హలో గురూ ప్రేమ కోసమే హిందీ వెర్షన్స్ ఏకంగా 400 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి. ఇస్మార్ట్ హీరోను హిందీ డిజిటల్ ఆడియన్స్ ముద్దుగా ఖిలాడీ అని పిల్చుకుంటారు. నెక్ట్స్ ఏంటి అని వెయిట్ చేస్తూనే వుంటారు. ప్రస్తుతం లింగుసామి డైరెక్షన్‌లో ‘ది వారియర్’, బోయపాటి కెప్టెన్సీలో అనౌన్స్ అయిన మరో మూవీతో డైరెక్ట్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు రామ్ పోతినేని. ఇప్పటిదాకా ఉత్తరాదిలో డిజిటల్ స్క్రీన్స్‌పై చెలరేగిన ఈ రెడ్ స్టార్.. ఇకపై బిగ్‌స్క్రీన్స్ మీద కూడా హవా చాటే ఛాన్సుంది మరి.
మరిన్ని ఇక్కడ చదవండి :