AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: పుష్ప ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్‌ స్పెషల్‌ గిఫ్ట్‌.. బ్యాక్‌ టు బ్యాక్‌ డైలాగ్స్‌ అన్నీ ఒకే చోట..

Pushpa: పుష్ప.. దేశవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్‌ (Allu arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దేశ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సాధించింది. విడుదలైన అన్ని చోట్ల భారీ విజయాన్ని..

Pushpa: పుష్ప ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్‌ స్పెషల్‌ గిఫ్ట్‌.. బ్యాక్‌ టు బ్యాక్‌ డైలాగ్స్‌ అన్నీ ఒకే చోట..
Pushpa Dialogues
Narender Vaitla
|

Updated on: Mar 05, 2022 | 6:25 AM

Share

Pushpa: పుష్ప.. దేశవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్‌ (Allu arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దేశ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సాధించింది. విడుదలైన అన్ని చోట్ల భారీ విజయాన్ని దక్కించుకొని కలెక్షన్ల సునామీ సృష్టించింది. నిజానికి పుష్ప సినిమా కేవలం ప్రాంతానికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన మూవీ, కానీ కథలో కంటెంట్‌ ఉండాలనే కానీ భాష, ప్రాంతంతో సంబంధం లేదని రుజువు చేసిందీ సినిమా. బాహుబలి తర్వాత దేశ వ్యాప్తంగా ఈ స్థాయిలో చర్చ జరిగిన సినిమా పుష్పనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప విడుదలై దాదాపు మూడు నెలలు దగ్గరపడుతోన్నా పుష్ప క్రేజ్‌ ఇప్పటికీ తగ్గడం లేదు. ఈ సినిమా పాటలు సోషల్‌ మీడియాలో మార్మోగుతూనే ఉన్నాయి.

ఇక పుష్పలో డైలాగ్స్‌ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాయలసీమ స్లాంగ్‌లో అల్లు అర్జున్‌ పలికించిన డైలాగ్‌లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో డైలాగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో చిత్ర యూనిట్‌ తాజాగా అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. సినిమాలోని అన్ని డైలాగ్స్‌ను ఒక చోట చేర్చి ఒక వీడియోను విడుదల చేశారు. డైలాగ్‌ జ్యూక్‌ బాక్స్‌ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. సినిమా మొదలు నుంచి చివరి వరకు అల్లు అర్జున్‌ డైలాగ్‌లన్నింటినీ ఒక చోట చేర్చారు. మరి పుష్పరాజ్‌ పవర్‌ ఫుల్‌ డైలాగ్‌లను మీరూ ఓసారి వినేయండి..

ఇదిలా ఉంటే పుష్ప సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం అక్రమ సామ్రాజ్యానికి లీడర్‌గా మారిన తర్వాత పుష్ప రాజ్‌కు.. పోలీస్‌ ఆఫీసర్‌ షేకావత్‌తో జరిగిన పోరును పుష్ప ది రూల్‌లో చూపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

Also Read: Viral Video: కొంపముంచిన ఫోన్ స్క్రీన్.. గోతిలో పడ్డ యువకుడు.. వీడియో చుస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ అవుతున్న వీడియో..

Ram Pothineni: మన ఎనర్జిటిక్ స్టార్ ఆ సినిమాలతో ఉత్తరాది ఊపేస్తాడా..?

ఆర్టీసీ బస్సులో కీచక పర్వం.. ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిని.. డ్రైవర్ ఏం చేశాడంటే

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ