ఆర్టీసీ బస్సులో కీచక పర్వం.. ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిని.. డ్రైవర్ ఏం చేశాడంటే

ప్రయాణికుల భద్రత, వారిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడమే సంస్థ లక్ష్యమని చెబుతున్న ఆర్టీసీ(RTC) అధికారులు ఆ మేరకు చిత్తశుద్ధి చూపించడం లేదు. మహిళలపై రోజు రోజుకు నేరాలు..

ఆర్టీసీ బస్సులో కీచక పర్వం.. ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిని.. డ్రైవర్ ఏం చేశాడంటే
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 04, 2022 | 8:06 PM

ప్రయాణికుల భద్రత, వారిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడమే సంస్థ లక్ష్యమని చెబుతున్న ఆర్టీసీ(RTC) అధికారులు ఆ మేరకు చిత్తశుద్ధి చూపించడం లేదు. మహిళలపై రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు వారు ఒంటరిగా బయటకు వెళ్లేందుకూ భయపడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. కానీ అక్కడ కూడా వారికి వేధింపులు తప్పడం లేదు. తాజాగా కదులుతున్న బస్సులో ఓ మహిళపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి(Driver rape on Woman) పాల్పడ్డాడు. బస్సులో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఎలాగోలా తన భర్తకు చెప్పగా.. విజయవాడలో ఉన్న అతని స్నేహితుల సహాయంతో మహిళను కాపాడారు. ఈ ఘటనపై బాధితురాలు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి(Anakapalli)కి చెందిన ఓ మహిళ బంధువుల శుభకార్యానికి నెల్లూరు వచ్చింది. వేడుక అనంతరం నెల్లూరు నుంచి అనకాపల్లికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నెల్లూరు నుంచి విశాఖపట్నం వెళ్లే ఆర్టీసీ ఇంద్ర బస్సు ఎక్కింది. ఆ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు ఒంగోలు వచ్చే సరికి అందులో ఓ మహిళ, మరో ఇద్దరు పురుషులు ఉన్నారు. అప్పటి వరకు డ్రైవింగ్‌ చేసిన జనార్దన్‌ అనే వ్యక్తి.. బస్సును మరో డ్రైవర్‌కు అప్పగించాడు. తర్వాత లైట్లు ఆపేసి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో బలవంతంగా బలాత్కరించాడు.బస్సు గుంటూరుకు వచ్చే సరికి అందులో ఉన్న ప్రయాణికుడు కూడా దిగిపోయాడు. ఈ క్రమంలో డ్రైవర్ మళ్లీ బాధితురాలిపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. తనను రక్షించాలంటూ బాధితురాలు.. వెనకే ఉన్న మరో ప్రయాణికుడిని కోరింది. అతను డ్రైవర్ ను మందలించగా.. డ్రైవర్ అతనిపై దాడికి పాల్పడ్డాడు.

ఈలోగా ఆమె అనకాపల్లిలోని తన భర్తకు ఫోన్‌చేసి విషయాన్ని చెప్పింది. వెంటనే భర్త విజయవాడలో తాను పనిచేసే మార్కెటింగ్‌ కంపెనీ మేనేజర్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఆ మేనేజర్‌ వెంటనే కారులో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కు వచ్చాడు. సరిగ్గా బస్సు అక్కడికి రాగా.. ఆమెను రక్షించాడు. డ్రైవర్‌ జనార్ధన్‌పై బాధితురాలు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్‌ ఎ.జనార్దన్‌ను అధికారులు తక్షణం విధుల నుంచి తప్పించారు. మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేసి గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో బస్సును పంపారు. డ్రైవర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

Also Read

మీ ఫోన్​లో ఇంటర్నెట్ డేటా అయిపోయిందా..? అయితే నో ప్రాబ్లం.. ఈ ప్యాకేజీ మీకోసమే

SIDBI Jobs 2022: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 100 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

పెద్ద సినిమాల ఆఫర్లను వదులుకున్న బాలీవుడ్ బ్యూటీస్ లిస్ట్..