AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేస్ బుక్ తో పరిచయమై.. డబ్బులున్నాయని నమ్మించి, ఆపై నట్టేట ముంచి.. సీన్ కట్ చేస్తే

సోషల్ మీడియా(Social Media) ద్వారా ఎంత ఉపయోగం ఉందో.. అంతకన్నా ఎక్కువగా ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం ఫేస్ బుక్, వాట్సాప్, మెసెంజర్ వంటివి నిత్యజీవితంలో భాగమయ్యాయి. వాటిని వాడనిదే..

ఫేస్ బుక్ తో పరిచయమై.. డబ్బులున్నాయని నమ్మించి, ఆపై నట్టేట ముంచి.. సీన్ కట్ చేస్తే
Arrest
Ganesh Mudavath
|

Updated on: Mar 04, 2022 | 7:45 PM

Share

సోషల్ మీడియా(Social Media) ద్వారా ఎంత ఉపయోగం ఉందో.. అంతకన్నా ఎక్కువగా ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం ఫేస్ బుక్, వాట్సాప్, మెసెంజర్ వంటివి నిత్యజీవితంలో భాగమయ్యాయి. వాటిని వాడనిదే రోజు గడవని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొన్ని కొన్ని సార్లు వాటితో ముప్పూ తప్పదు. సామాజిక మాధ్యమాల ద్వారా నేరాలకు పాల్పడటం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. ఇలా సైబర్ నేరానికి(Cyber Crime) పాల్పడే వాళ్లను పట్టుకోవడం కూడా పోలీసులకు కత్తిమీద సాముగా మారుతోంది. తాజాగా విశాఖ జిల్లా ఎలమంచిలి(Elamanchili)లో ఇలాంటి సైబర్ మోసమే జరిగింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకున్న ఓ యువతి.. తన దగ్గర పౌండ్స్ ఉన్నాయని, వాటిని ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవాలని నమ్మించింది. ఇలా చేసేందుకు తన వద్ద డబ్బు లేదని, కొంత నగదు పంపిస్తే తిరిగి ఇచ్చేస్తానని నమ్మించింది. చివరకు బాధితుడిని నట్టేట ముంచి పరారైంది. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. ఈ నేరానికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో మనం చేసే పనుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురంలో రవిప్రసాద్ గుప్తా.. యూనిఫార్ట్స్‌ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది జూన్‌లో ఆయనకు ఫేస్‌బుక్‌ ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఇద్దరూ రోజూ మాట్లాడునేవారు. ఈ క్రమంలో తాను లండన్‌లో ఉంటున్నానని, ఇండియాకి వస్తున్నట్లు విమాన టికెట్లను యువతి పోస్ట్‌ చేసింది. తన వద్ద 5లక్షలకు పైగా పౌండ్స్‌కి సంబంధించిన డీడీ ఉందని, ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌ కోసం రూ.68,500 కావాలని కోరింది. ఈ మేరకు మరో యువతి ఖాతాకు డబ్బులు పంపించాలని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన గుప్తా.. 30 విడతల్లో రూ.27.20 లక్షలు పంపారు. ఆ తరువాత ఇద్దరి ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ కావడం, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌ ఖాతాలూ పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు వినియోగించే ఈ-మెయిల్స్‌ చిరునామాలు, ఐపీ అడ్రస్‌లు, వంటి సాంకేతికత ఆధారంగా వారు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. నిందితులు తాము కొట్టేసిన డబ్బుతో వివిధ వస్తులను కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌ను వినియోగించేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వారు ఫ్లిప్‌కార్ట్‌ వస్తువులు తీసుకున్న చిరునామా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి మణిపూర్‌ రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఢిల్లీలో పట్టుకున్నారు. వీరిని ఎలమంచిలి కోర్టులో ప్రవేశపెట్టి.. రిమాండ్ కు తరలించారు. ఘరానా మోసానికి సంబంధించిన కేసును ఛేదించిన పోలీసులకు ఎస్పీ కృష్ణారావు.. నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు.

Also Read

Big News Big Debate Live: అణు ముప్పు తప్పదా..! రష్యా అణు యుద్ధాన్ని కోరుకుంటోందా..?(వీడియో)

Viral Video: డ్యామిట్! కథ అడ్డం తిరిగిందే.. రెండు జింకల పోరు చిరుతకు లాభం.. షాకింగ్ వీడియో మీకోసం..

Bank Jobs 2022: నెలకు 89 వేల జీతంతో.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 105 స్పెషలిస్టు ఆఫీసర్‌ ఉద్యోగాలు..