AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డ్యామిట్! కథ అడ్డం తిరిగిందే.. రెండు జింకల పోరు చిరుతకు లాభం.. షాకింగ్ వీడియో మీకోసం..

Viral Video: రెండు పిల్లుల మధ్య జరిగిన గొడవను ఓ కోతి తనుకు అనుకూలంగా మలుచుకున్న నీతి కథ మనకు తెలిసిందే. ఇలా ఇద్దరి మధ్య పోట్లాట..

Viral Video: డ్యామిట్! కథ అడ్డం తిరిగిందే.. రెండు జింకల పోరు చిరుతకు లాభం.. షాకింగ్ వీడియో మీకోసం..
Wild Life
Shiva Prajapati
|

Updated on: Mar 04, 2022 | 6:25 PM

Share

Viral Video: రెండు పిల్లుల మధ్య జరిగిన గొడవను ఓ కోతి తనుకు అనుకూలంగా మలుచుకున్న నీతి కథ మనకు తెలిసిందే. ఇలా ఇద్దరి మధ్య పోట్లాట మూడోవాడికి లాభం అన్నట్లుగా.. రెండు జింకల పోరు చిరుతకు పసందైన అవకాశాన్నిచ్చింది. అవును.. రెండు జింకల కొట్లాడుకుంటూ చిక్కుకుపోగా.. అదునుచూసి దాడి చేసింది చిరుత. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అడవిలో క్రూర మృగాలు ఎక్కువగా జింకలను వేటాడటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ అటవిలోని మైదాన ప్రాంతంలో కొన్ని కొమ్ముల జింకలు మేత మేస్తున్నాయి. ఇంతలో రెండు జింకల మధ్య పోరు మొదలైంది. రెండూ పోట్లాడుకున్నాయి. అయితే, రెండు జింకలకు కొమ్ములు ఉండగా.. ఆ కొమ్ములు చిక్కుపడిపోయాయి. దాంతో అవి విడిపించుకోలేక తంటాలు పడ్డాయి. ఇంతలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గడ్డి పొదల్లోంచి అకస్మాత్తుగా దూసుకొచ్చింది ఓ చిరుత. ఆ రెండు జింకలు పోట్లాడుకుంటుండగా.. ఇదే తనకు అవకాశంగా భావించింది. వాటిని లొట్టలేసుకుంటూ చూసింది. రెండింట్లో ఏదో ఒకదానిని పట్టుకోవాలని చిరుత ప్రయత్నించింది. అయితే రెండు జింకల కొమ్ములు ముడిపడిపోవడంతో అవి తన్నులాడుకున్నాయి. మరోవైపు చిరుత కంట పడటంతో.. ఆ రెండూ బెంబేలెత్తిపోయాయి. దాంతో ఆ రెండూ పారిపోయేందుకు ప్రయత్నించాయి. కానీ, కొమ్ములు మెలిపడటంతో అదిసాధ్యం కాక.. అక్కడే గింజుకున్నాయి. దాంతో ఆ చిరుత వాటిని తినేందుకు ప్రయత్నించినా సాధ్యం అవలేదు. ఆ తన్నులాటలో తానెక్కడ గాయపడుతానో అనే భయంతో ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి వేస్తూ ఊగీసలాట ఆడింది. వాటిని ఎలాగైనా ఆరగించాలని ఊవిళ్లూరిన చిరుత.. తొలుత స్వల్పంగా దాడి చేసింది. అయితే, రెండు జింకల గింజుకుంటుండటంతో.. ఏం చేయాలో అర్థం కాక వాటిని కాచుకుంటూ పరుగులు తీసింది. ఇంతలోనే వీడియో పూర్తయ్యింది. అయితే, అక్కడి పరిస్థితిన బట్టి చూస్తే రెండు జింకల్లో ఏదో ఒకటి చిరుతకు ఆహారం ఉంటుంది.

కాగా, ఈ వైరల్ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘రెండు జింకల మధ్య గొడవను చిరుత తనకు అవకాశంగా మలుచుకుంది. జింకలపై దాడికి దిగింది. ప్రపంచం కూడా అలాంటిదే. ఒకరి గొడవను మరొకరు సద్వినియోగం చేసుకుంటారు.’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాతో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి దీనిపై విశేష స్పందన వస్తోంది. తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

CM KCR: ఇప్పటికైతే ఏ ఫ్రంట్ లేదు.. ఏదైనా ఉంటే చెబుతాం.. రాంచీ‌లో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Ind Vs Sl: పంత్‌ సెంచరీ మిస్‌.. రాణించిన విహారి.. తొలి రోజు టీమిండియాదే..

Bank Jobs 2022: నెలకు 89 వేల జీతంతో.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 105 స్పెషలిస్టు ఆఫీసర్‌ ఉద్యోగాలు..