Ind Vs Sl: పంత్ సెంచరీ మిస్.. రాణించిన విహారి.. తొలి రోజు టీమిండియాదే..
వందో టెస్టులో వంద కొడతాడనుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి అభిమానులను నిరుత్సాహ పరిచాడు. హిట్‌మ్యాన్ రోహిత్ కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు
వందో టెస్టులో వంద కొడతాడనుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి అభిమానులను నిరుత్సాహ పరిచాడు. హిట్‌మ్యాన్ రోహిత్ కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. అయితే వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తన ధనాధన్ బ్యాటింగ్‌తో అభిమానులను ఉత్సాహపరిచాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. మరింత వేగంగా ఆడే క్రమంలో సెంచరీ కోల్పోయినా టీమిండియాకు భారీస్కోరు అందించాడు. ఇక పుజారా స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చిన తెలుగు కుర్రాడు హనుమ విహారీ కూడా స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ తో ఆకట్టుకోవడంతో మొహాలీ టెస్ట్ (Mohali Test) తొలి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు సాధించింది. లంక బౌలర్లలో ఎంబుల్దెనియా 2.. లక్మల్, ఫెర్నాండో, లహిరు కుమార, డిసిల్వా తలో వికెట్ తీశారు.
విహారి సంయమనం.. పంత్ దూకుడు..
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్ లహిరు బౌలింగ్ లో లక్మల్ చేతికి చిక్కాడు. కాగా వన్‌డౌన్‌లో విరాట్ వస్తాడని చాలామంది భావించారు. అయితే ఆశ్చర్యకరంగా హైదరాబాదీ ఆటగాడు హనుమ విహారి క్రీజులోకి వచ్చాడు. తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు క్రీజులో కుదురుకున్నట్లు అనిపించిన మయాంక్ ఎంబుల్దెనియాకు చిక్కడంతో 80 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. దీంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. బౌండరీలతో స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. సెంచరీతో వందో టెస్టును చిరస్మరణీయంగా మల్చుకుంటాడనుకున్న క్రమంలో ఎంబుల్దెనియా వేసిన బంతికి కోహ్లీ (45) క్లీన్ బౌల్డయ్యాడు. హనుమ విహారి (58), ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (27) వరుసగా పెవిలయన్ చేరడంతో 228 పరుగులకే టీమిండియా సగం వికెట్లను కోల్పోయింది. అయితే క్రీజులోకి వచ్చిన పంత్, జడేజా సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. ఆరోవికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం (102) అందించారు. మూడంకెల స్కోరు సాధిస్తాడనుకున్న రిషభ్ (96) లక్మల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అవ్వడంతో 332 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్‌ను చేజార్చుకుంది. రవీంద్ర జడేజా (45) , అశ్విన్(10)తో కలిసి మరో వికెట్ పడకుండా మొదటి రోజు ఆటను ముగించారు.
That’s Stumps on Day 1 of the 1st Test.#TeamIndia 357/6 after 85 overs. Rishabh Pant and Ravindra Jadeja together added 104 runs on the board.
Pant 96 Jadeja 45*
Scorecard – https://t.co/c2vTOXAx1p #INDvSL @Paytm pic.twitter.com/pXSRnSXBsh
— BCCI (@BCCI) March 4, 2022
Also read:Bank Jobs 2022: నెలకు 89 వేల జీతంతో.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 105 స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాలు..
Hyderabad: ఈ ఆఫర్ 31 వరకే.. తరువాత సీన్ వేరే ఉంటుంది.. జాయింట్ సీపీ కీలక వ్యాఖ్యలు..