Andhra Pradesh: ఇద్దరు ఫ్రెండ్స్ మిస్సింగ్.. రెండేళ్లుగా వీడని చిక్కుముడి.. ఒక్క పోస్ట్‌తో వెలుగులోకి సంచలన విషయాలు

కొడుకు అదృశ్యంపై ఆ తల్లి చేసిన పోరాటానికి పోలీసులు తల వంచారు. అదృశ్యం అయిన రెండేళ్ళ తర్వాత ఆ యువకుడిని స్నేహితుడే హత్య చేసినట్లు తేల్చారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Andhra Pradesh: ఇద్దరు ఫ్రెండ్స్ మిస్సింగ్.. రెండేళ్లుగా వీడని చిక్కుముడి.. ఒక్క పోస్ట్‌తో వెలుగులోకి సంచలన విషయాలు
Ap Crime News
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 04, 2022 | 7:00 PM

Guntur District: కొడుకు అదృశ్యంపై ఆ తల్లి చేసిన పోరాటానికి పోలీసులు తల వంచారు. అదృశ్యం అయిన రెండేళ్ళ తర్వాత ఆ యువకుడిని స్నేహితుడే హత్య చేసినట్లు తేల్చారు. నెహ్రూ నగర్ కు చెందిన ఫణి కృష్ణ, అజయ్ సాయి స్నేహితులు. అజయ్ సాయికి వివాహం కాగా ఫణి కృష్ణ అవివాహితుడు. అయితే 2020 ఫిబ్రవరి 16న వీరిద్దరూ గోవా(Goa) వెళుతున్నట్లు ఇళ్లలో చెప్పారు. అప్పటి నుండి ఇద్దరి జాడ దొరకలేదు. ఫణి కృష్ణ ఇంటికి తిరిగి రాకపోవటంతో అతని తల్లి లలితా భవాని కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది‌. మరో వైపు అజయ్ సాయి తల్లి శైలజ కూడా కొడుకు అదృశ్యంపై తాడికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుండి ఈ కేసులను పోలీసులు చేధించలేకపోయారు. చేతికి అందివచ్చిన కొడుకు అదృశ్యం కావటంతో ఫణి కృష్ణ తండ్రి మంచం పట్టాడు. చివరికి దిగులుతోనే చనిపోయాడు. మరోవైపు ఫణి కృష్ణ సోదరుడు కూడా మానసిక అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే లలితా భవాని తన కొడుకు ఆచూకీ చెప్పాలని అధికారుల చుట్టూ తిరిగింది‌. ఈ మధ్య కాలంలో అజయ్ సాయి హైదరాబాద్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పింది. అయినా పోలీసుల నుండి స్పందన రాకపోవటంతో లలితా భవాని ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. అజయ్ సాయి కుటుంబ సభ్యుల ఫోన్లపై తాడికొండ ఎస్సై వెంకటాద్రి దృష్టి పెట్టారు. ఎట్టకేలకు రెండేళ్ళ తర్వాత అజయ్ సాయిని పట్టుకొచ్చి తమదైన శైలిలో పోలీసులు విచారించారు.

2020 ఫిబ్రవరి 16 వ తేదినే ఫణి కృష్ణను హత్య చేసినట్లు అజయ్ సాయి అంగీకరించాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే మర్డర్ చేసినట్లు వెల్లడించాడు. ఆ రోజున ఇద్దరూ కలిసి అమరావతి రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవించారు. అనంతరం అజయ్ సాయి రాయితో ఫణి ముఖంపై దాడి చేసి చంపేశాడు. అనంతరం మృతదేహం పై పెట్రోల్ పోసి తగుల బెట్టాడు. అప్పటి నుండి హైదరాబాద్ పారిపోయి అక్కడే తల దాచుకున్నాడు. ఫణి కృష్ణ తల్లి లలితా భవాని సోషల్ మీడియా పోరాటంతో ఎట్టకేలకు హంతకుడుని పోలీసులు పట్టుకున్నారు.

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.

Also Read: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..

టక్కులాడి.. కి’లేడీ’.. ఏం చేసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..