Hyderabad Crime: స్నాప్ చాట్ ద్వారా పరిచయం.. బాలికపై పైశాచికం.. హోటల్ కు తీసుకెళ్లి దారుణం

సెల్ ఫోన్ లు ఎంత ఉపయోగకరమో, అంతకన్నా ఎక్కువ ప్రమాదకరమని ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. స్నాప్ చాట్(Snap Chat) యాప్ ద్వారా బాలికను పరిచయం చేసుకున్న యువకుడు.. ఆమెతో సాన్నిహిత్యాన్ని..

Hyderabad Crime: స్నాప్ చాట్ ద్వారా పరిచయం.. బాలికపై పైశాచికం.. హోటల్ కు తీసుకెళ్లి దారుణం
Arrest Hyderabad
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 04, 2022 | 6:49 PM

సెల్ ఫోన్ లు ఎంత ఉపయోగకరమో, అంతకన్నా ఎక్కువ ప్రమాదకరమని ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. స్నాప్ చాట్(Snap Chat) యాప్ ద్వారా బాలికను పరిచయం చేసుకున్న యువకుడు.. ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. నిత్యం ఆమెతో మాట్లాడుతూ దగ్గరయ్యాడు. అతని మాయమాటలు నమ్మిన బాలిక.. అతనితో కలిసి హోటల్ రూంకు వెళ్లింది. అక్కడ ఆ యువకుడు బాలికపై అత్యాచారానికి(Rape) పాల్పడ్డాడు. దీనికి మరో ఇద్దరు వ్యక్తులు సహకరించడం గమనార్హం. అతని చెర నుంచి తప్పించుకున్న బాలిక.. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు. హైదరాబాద్(Hyderabad) లోని మలక్​పేట్ ప్రాంతానికి చెందిన ఆమన్ ఖాన్.. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడికి స్నాప్ చాట్ ద్వారా కార్ఖానాకు చెందిన ఓ బాలిక పరిచయమైంది. ఇద్దరూ తరుచూ మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈ క్రమంలో నిన్ను ప్రేమిస్తున్నానని అమర్ ఖాన్ బాలికను నమ్మించాడు. ఆమెకు మాయమాటలు చెప్పి హైదరాబాద్​లో రూంలు అద్దెకు తీసుకున్నాడు. ఇతనికి హోటళ్లలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు సహకరించారు. అనంతరం బాలికపై అమన్ ఖాన్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

అతని చెర నుంచి తప్పించుకున్న బాలిక.. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే అప్రమత్తమై ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఆమన్ ఖాన్​తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. అనంతరం నిందితులను రిమాండ్​కు తరలించారు.

Also Read

Adilabad: నెరవేరిన ఆరేళ్ల కల.. ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్‌ రావు..

Kidney Failure Symptoms: మీ కిడ్నీలు ఆరోగ్యంగానే ఉన్నాయా? లక్షణాలు బయటపడేనాటికే 90 శాతం పాడైపోయే ప్రమాదం.. ఇలా చేశారంటే..

Weight Loss: వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదా? అయితే, కారణమిదే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే