Adilabad: నెరవేరిన ఆరేళ్ల కల.. ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్‌ రావు..

ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.

Adilabad: నెరవేరిన ఆరేళ్ల కల.. ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్‌ రావు..
T Harish Rao
Follow us

|

Updated on: Mar 04, 2022 | 6:29 PM

ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఘనంగా ప్రారంభించారు.  రూ. 150 కోట్లతో ఏర్పాటు చేసిన అదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆదిలాబాద్ (Adilabad) ప్రజలకు అంకితమిచ్చారు. రేడియాలజీ ల్యాబ్ ను ప్రారంబించిన మంత్రి హరీశ్ రావు..ట్రయల్ రన్ ను ప్రారంభించి వీలైనంత త్వరగా మిగిలిన అన్ని రకాల సూపర్ సేవలను ప్రారంభించాలని రిమ్స్ అదికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖా నాయక్ , రాథోడ్ బాపురావు , ఎమ్మెల్సీ విఠల్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొ‌న్నారు. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి . ఆస్పత్రి నిర్వహణ కోసం ఏడాదికి రూ.50 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.

గల్లీ ప్రజలే మాకు బాసులు.. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్‌ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. ‘దేశంలో తెలంగాణ బెస్ట్ అని నీతి ఆయోగ్ చెప్పింది. కరోనా కట్టడిలో బాగా పని చేశామని హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సైతం తెలంగాణ వైద్య సేవలను కొనియాడింది. అయితే మారుమూల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ లో మెరుగైన వైద్య సేవలు అందించడం ఇక్కడి గల్లీ లీడర్లకు ఇష్టం లేనట్లుగా ఉంది. తెలంగాణ వైద్యసేవలను కేంద్రంలో మంత్రులు మెచ్చుకుంటుంటే గల్లీలో మాత్రం బచ్చాలీడర్లు అడ్డుపడుతున్నారు. దమ్ముంటే ఆదిలాబాద్ సీసీఐ ని పునః ప్రారంభించాలి. పేదలకు అద్భుత వైద్యం అందిస్తున్న మూడో రాష్ట్రం తెలంగాణ అని రాజ్యసభలో కేంద్రం చెప్పింది. ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న యూపీ చిట్ట చివరి స్థానంలో ఉందని చెప్పింది. ఎవరి పాలనలో మెరుగైన వైద్యం అందుతుందో మీరే తేల్చుకోవాలి. మాకు ఢిల్లీలో బాసులు లేరు. గల్లీల్లో ఉన్న ప్రజలే మాకు బాసులు. వారి సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నాం.. ఇంకా చేస్తాం. ఇద్దరు ముగ్గురు వచ్చుడు.. ఒకడు కార్లకు అడ్డం పడుడు.. ఇంకొకడు వీడియో తీసుకునుడు.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసుకునుడు.. గిలాంటి సోషల్ మీడియా తోకలను పెద్దగా పట్టించుకోం.. అభివృద్దికి అడ్డుపడితే చూస్తూ ఊరుకోం.. కాళ్లల్లో కట్టెలు పెట్టేవారిని ఊరికే వదిలిపెట్టం’

తెలంగాణపై కేంద్రం వివక్ష… ‘దేశంలో ఏడేళ్లలో కొత్తగా 7 ఐఐఎంలు కేటాయిస్తే అందులో తెలంగాణకు కేటాయించినవి సున్నా. ఐఐటీలు 7 ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఇచ్చినవి శూన్యం. దేశవ్యాప్తంగా 16 ట్రిపుల్ఐటీలు ఏర్పాటు చేస్తే.. తెలంగాణకు మాత్రం రిక్త హస్తాలు చూపించారు. అదేవిధంగా వివిధ రాష్ర్టాల్లో మొత్తం 157 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుచేస్తే.. మా రాష్ట్రంలో మాత్రం ఒక్క కాలేజీని కూడా స్థాపించలేదు. నవోదయ పాఠశాలల కేటాయింపులోనూ మా రాష్ట్రానికి అన్యాయం చేశారు. కనీసం విభజన హామీలు కూడా నెరవేర్చని వారు మా అభివృద్ధికి అడ్డుపడటం దిగజారుడు రాజకీయాలే. ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ అభివృద్ధి ఆగదు’ అని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

Also Read:NIO Vizag Jobs 2022: ఆన్‌లైన్ ఇంటర్వ్యూతోనే.. విశాఖపట్నంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు!

రెండేళ్లలో వెయ్యి ఆలయాలు నిర్మిస్తాం.. టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి వెల్లడి

అందాల అనుపమ సీతాకోక చిలుకగా మారితే ఇదిగో ఇలానే ఉంటది…

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..