TTD: రెండేళ్లలో వెయ్యి ఆలయాలు నిర్మాణం.. టీటీడీ సంచలన ప్రకటన
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాబోయే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ(TTD) ఛైర్మన్ సుబ్బారెడ్డి(Subba Reddy) వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాబోయే రెండేళ్లలో...
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు టీటీడీ(TTD) ఛైర్మన్ సుబ్బారెడ్డి(Subba Reddy) మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాబోయే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన, ఎస్సీ, బీసీ ప్రాంతాల్లో వెయ్యి ఆలయాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు. వడమాలపేట మండలం అప్పలాయగుంట (Appalayagunta)లో రూ.3.4 కోట్లతో నిర్మించిన టీటీడీ కల్యాణ మండపాన్ని నగరి ఎమ్మెల్యే రోజాతో కలసి, ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే రోజా విజ్ఞప్తి మేరకు అప్పలాయగుంటలో మూడు అంతస్తుల్లో కల్యాణ మండపం నిర్మించామని అన్నారు. సకల సదుపాయాలతో, తక్కువ అద్దెకు 700 మంది ఆహ్వానితులతో ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చని పెర్కొన్నారు. ఆలయంలోనూ రూ.2.25 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నగరిలో దేశమ్మ ఆలయ అభివృద్ధికి రూ. కోటి 20 లక్షలు, పుత్తూరు ద్రౌపతి ఆలయ అభివృద్ధికి రూ కోటి 25 లక్షలు, నిండ్రలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.కోటి 70 లక్షలు మంజూరు చేశామన్నారు. పుత్తూరు లో శివాలయం కోనేరు అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు చేశామని, మరిన్ని అభివృద్ధి పనుల కోసం కూడా నిధులు మంజూరు చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. నగరిలో టీటీడీ కల్యాణ మండపం మంజూరు చేస్తామని చెప్పారు.
చెన్నై నుంచి కాలినడకన వచ్చే భక్తులు.. అప్పలాయగుంటలో స్వామివారి దర్శనం చేసుకుని తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోందని ఎమ్మెల్యే రోజా అన్నారు. టీటీడీ కల్యాణ మండపాల్లో పెళ్లి చేసుకుంటే వధూవరులకు స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పలాయగుంటలో అన్ని సౌకర్యాలతో, తక్కువధరతో పెళ్లి చేసుకునేలా టీటీడీ కల్యాణ మండపం నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. కల్యాణ మండపం మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేయించిన వైవీ సుబ్బారెడ్డి కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
మాట నిలబెట్టుకున్న మంత్రి.. గ్రామస్థుల కళ్లల్లో వెల్లి వెరిసిన ఆనందం.. అసలు విషయం తెలిస్తే మీరూ ఫిదా
CM KCR: ఇప్పటికైతే ఏ ఫ్రంట్ లేదు.. ఏదైనా ఉంటే చెబుతాం.. రాంచీలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు