మాట నిలబెట్టుకున్న మంత్రి.. గ్రామస్థుల కళ్లల్లో వెల్లి వెరిసిన ఆనందం.. అసలు విషయం తెలిస్తే మీరూ ఫిదా

మా ఊరికి బస్సు కావాలి మంత్రిగారు. బస్సులేకే పిల్లలు బడికి రాలేకపోతున్నారు. మీరే ఆఫీసర్లకు చెప్పి మా ఊరికి బస్సు వచ్చేలా చూడాలి సారూ.. అన్న గ్రామస్థుల అభ్యర్థనపై ఆ మంత్రి వెంటనే స్పందించారు. మరుసటి రోజే..

మాట నిలబెట్టుకున్న మంత్రి.. గ్రామస్థుల కళ్లల్లో వెల్లి వెరిసిన ఆనందం.. అసలు విషయం తెలిస్తే మీరూ ఫిదా
Minister Rtc
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 04, 2022 | 4:49 PM

మా ఊరికి బస్సు కావాలి మంత్రిగారు. బస్సులేకే పిల్లలు బడికి రాలేకపోతున్నారు. మీరే ఆఫీసర్లకు చెప్పి మా ఊరికి బస్సు వచ్చేలా చూడాలి సారూ.. అన్న గ్రామస్థుల అభ్యర్థనపై ఆ మంత్రి వెంటనే స్పందించారు. మరుసటి రోజే ఆ ఊరికి బస్సు వేయించారు. మరో విశేషం ఏమిటంటే.. మంత్రి గారూ అదే బస్సులో ప్రయాణం చేశారు. ఇంతకీ ఎవరా మంత్రి..? ఇంత హఠాత్తుగా ఎందుకు బస్సు వేయించారు..? అనేవి ఇప్పుడు చూద్దాం. తెలంగాణలోని జనగామ(Janagama) జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిదిలోని దేవరుప్పుల మండలంలో.. రెండు రోజుల క్రితం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్(Errabelli Dayakar) రావు పర్యటించారు. రామరాజుపల్లి గ్రామాన్ని సందర్శించారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు విద్యార్థులకు వివరించారు. ఈ క్రమంలో రామరాజుపల్లి గ్రామానికి బ‌స్సు ర‌వాణా సౌకర్యం లేకే పిల్లలు స్కూల్ కి రాలేకపోతున్నామని మంత్రికి అభ్యర్థించారు. దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బ‌స్సు సౌకర్యం(Bus facility) క‌ల్పించాల‌ని మంత్రి ఎర్రబెల్లికి విన్నపించుకున్నారు.

ప్రజలు, విద్యార్థుల అభ్యర్థనపై మంత్రి దయాకర్ సానుకూలంగా స్పందించారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తానని మాట ఇచ్చారు. అంతే కాకుండాఇచ్చిన మాట ప్రకారం రెండు రోజులకే గ్రామానికి బస్సు వచ్చేలా ఏర్పాటు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆర్టీసీ ఆధికారుల‌తో మాట్లాడి రామరాజుపల్లి ప్రజల కోరికను నేరవేర్చారు. ఇచ్చిన హామీ ప్రకారం రెండు రోజుల వ్యవధిలోనే వారికి బస్ సౌకర్యం కల్పించిన మంత్రి ఎర్రబెల్లి తన చేతుల మీదుగానే ప్రారంభించారు. ఊళ్ళో బస్సు హారన్ సౌండ్ వినపడడంతో ఈ గ్రామస్థులంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు. వారి ఆనందాన్ని చూసి అచ్చెరువొందిన మంత్రి.. గ్రామస్థులు, విద్యార్థులతో కలిసి అదే బస్సులో ప్రయాణించారు. రామరాజుపల్లి నుంచి సింగరాజుపల్లి గ్రామం వరకు బస్ లోనే ప్రయాణించిన మంత్రి.. వారితో ముచ్చట్లాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రితో కలిసి బస్ లో ప్రయాణం చేస్తూ మిఠాయిలు పంచుకుంటు సంబరాలు జరుపుకున్నారు.

ఇవీ చదవండి.

Electric Cooker: కరెంట్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే మీ గుండె గుబేలుమంటుంది

Ram Gopal Varma: ఆయన పీఎం అవుతాడట.. ఈయనను సీఎం చేస్తాడట.. కేఏ పాల్ వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ..

TS High Court jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! పది, ఇంటర్‌ అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో 591 ఉద్యోగాలు..