Army Jobs 2022: సికింద్రాబాద్‌లోని MCEMEలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలోనున్న మిలిటరీ కాలేజీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (MCEME) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి..

Army Jobs 2022: సికింద్రాబాద్‌లోని MCEMEలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Mceme Secunderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 04, 2022 | 7:23 PM

MCEME Secunderabad Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలోనున్న మిలిటరీ కాలేజీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (MCEME) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: ల్యాబొరేటరీ అటెండెంట్, జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, సీనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్‌, లైబ్రరీ అటెండెంట్‌ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.14,950ల నుంచి రూ.18,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీసీఏ, బీఎస్సీ, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: MCEME, Trimulgherry (P.O), Secunderabad, Telangana.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 21, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

SIDBI Jobs 2022: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 100 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!