AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్ నుంచి నిర్మాతగా మారిన ‘చిన్నారి పెళ్ళి కూతురు’.. ఆ సినిమాతో ప్రొడక్షన్ రంగంలోకి..

'చిన్నారి పెళ్ళి కూతురు' సీరియల్‏తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైపోయింది అవికాగోర్. ఇక ఆ సీరియల్ తర్వాత అవికా.. రాజ్ తరుణ్ హీరోగా పరిచయమైన

హీరోయిన్ నుంచి నిర్మాతగా మారిన 'చిన్నారి పెళ్ళి కూతురు'.. ఆ సినిమాతో ప్రొడక్షన్ రంగంలోకి..
Rajitha Chanti
|

Updated on: Feb 16, 2021 | 4:52 PM

Share

‘చిన్నారి పెళ్ళి కూతురు’ సీరియల్‏తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైపోయింది అవికాగోర్. ఇక ఆ సీరియల్ తర్వాత అవికా.. రాజ్ తరుణ్ హీరోగా పరిచయమైన టఉయ్యాల జంపాలట సినిమలో హీరోయిన్‏గా నటించి మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజు గారి గది 3’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ అమ్మడు నిర్మాతగా మారింది.

నెపోలియన్ చిత్ర నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లితో కలిసి అవికా గోర్ ఓ సినిమాను నిర్మించేందుకు సిద్ధమైంది. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి రోవర్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎంఎస్ చలపతి రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ.. “నేనే చిన్నప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇక్కడ ప్రతి అంశాన్ని నిశితంగా గమనించాను. అందుకే నాకు ప్రొడక్షన్ రంగంలోకి రావాలని అనుకున్నాను. ఆచార్య క్రియేషన్స్ కోసం రాసిన కథను మురళీ నాగ శ్రీనివాస్ గంధం నాకు చెప్పారు. నాకు ఈ కథ బాగా నచ్చింది. నిర్మాతగా మారేందుకు ఈ సినిమా సరైనదని అనుకున్నాను. వెంటనే నేను ప్రొడక్షన్‏లో భాగమవుతానని చెప్పాను. ఆచార్య క్రియేషన్స్ అవికా స్క్రీన్ క్రియేషన్స్ బంధం ఈ సినిమాతో మరింత బలపడుతుందని నేను ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది అవికా.

Also Read:

పాన్ ఇండియా మూవీ షూటింగ్ పూర్తిచేసిన నాగార్జున.. వారితో నటించడం అద్భుతం అంటూ ట్వీట్..