గుణశేఖర్ ‘శాకుంతలం’గా అనుష్క..!

దాదాపు ఐదు సంవత్సరాల గ్యాప్ తరువాత టాలెంటెడ్‌ డైరెక్టర్ గుణశేఖర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే

  • Publish Date - 1:09 pm, Sat, 10 October 20 Edited By:
గుణశేఖర్ 'శాకుంతలం'గా అనుష్క..!

Anushka in Shakuntalam: దాదాపు ఐదు సంవత్సరాల గ్యాప్ తరువాత టాలెంటెడ్‌ డైరెక్టర్ గుణశేఖర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. హిరణ్యకశ్యప కంటే ముందు శాంకుతలంను తెరకెక్కిస్తున్నట్లు గుణశేఖర్ తెలిపారు. మహాభారత ‘ఆదిపర్వ’లోని ఓ ప్రేమకథాంశంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక ఈ ప్రకటన వచ్చిన తరువాత శాకుంతలంపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో అనుష్క ప్రధాన పాత్రలో నటించనున్నారట.

మొదట ఈ పాత్రకు గానూ పూజా హెగ్డేను సంప్రదించారని, ఆమె అంత ఆసక్తిని చూపలేదని టాక్. ఆ తరువాత అనుష్కను సంప్రదించారట ఆమె ఓకే చెప్పారని సమాచారం. గతంలో అనుష్క, గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవిలో నటించారు. ఈ క్రమంలో గుణశేఖర్ పని గురించి బాగా తెలిసిన అనుష్క, ఇప్పుడు శాకుంతలంకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ మూవీకి దేవసేన ప్రధానాకర్షణగా మారనున్నారు. కాగా అనుష్క నటించిన నిశ్శబ్దం ఇటీవల ఓటీటీలో విడుదల కాగా.. మిక్స్‌డ్‌ రివ్యూలు సాధించుకున్న విషయం తెలిసిందే.

Read More:

ప్రభాస్, ఎన్టీఆర్‌లతో సినిమాలపై ‘కేజీఎఫ్’ దర్శకుడి స్పందన

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల స్కాం.. ప్రొద్దుటూరు కేంద్రంగా సాగిన కుంభకోణం