సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల స్కాం.. ప్రొద్దుటూరు కేంద్రంగా సాగిన కుంభకోణం

ఏపీలో సంచలనం సృష్టించిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల కుంభకోణం కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రొద్దుటూరు కేంద్రంగా

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల స్కాం.. ప్రొద్దుటూరు కేంద్రంగా సాగిన కుంభకోణం
Follow us

| Edited By:

Updated on: Oct 10, 2020 | 11:43 AM

CMRF check scam: ఏపీలో సంచలనం సృష్టించిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల కుంభకోణం కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రొద్దుటూరు కేంద్రంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఒక్కొక్కరి పేరు బయటకు వస్తోంది. గతంలో ఈ కేసులో భాస్కర్ రెడ్డి పేరు రాగా.. తాజాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దగ్గర పనిచేసే చెన్న కేశవరెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది.

ఇక ఈ విషయంపై మాట్లాడిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. తన ఆఫీస్‌లో పని చేసే చెన్నకేశవ రెడ్డి ద్వారా పాత చెక్కులు బయటకు వెళ్లినట్లు చెప్పారు. ఈ విషయం తెలిసి తానే స్వయంగా చెన్నకేశవ రెడ్డి పోలీసులకు అప్పగించానని అన్నారు. ఓ ప్రైవేట్ కాలేజీలో పనిచేసే భాస్కరరెడ్డి, తన ఆఫీస్‌లో పని చేసే చెన్నకేశవరెడ్డికి డబ్బులు ఇచ్చి, తన ఆఫీస్‌లో పాత చెక్కులు తీసుకున్నాడని వెల్లడించారు. అందులో మూడు పాత చెక్కులకు సంబంధించి 9లక్షల 90వేలు డ్రా చేశారని.. ఒక్కో చెక్‌కి పది వేల చొప్పున చెన్న కేశవ రెడ్డికి కమిషన్ ఇచ్చాడని వివరించారు. మిగిలిన చెక్కులపై ఓ ట్రస్ట్ ద్వారా 50కోట్లకు పైగా డ్రా చేసేందుకు ప్రయత్నించారని, అప్పుడే నకిలీ చెక్కుల బాగోతం బయటపడిందని పేర్కొన్నారు.

ఆధునిక టెక్నాలజీ సాయంతో తన ఆఫీస్‌లో నుంచి తీసుకెళ్లిన చెక్కులను మానుప్లేట్ చేసి చెన్నైలో ఒక ముఠాకు అప్పగించారని, మొత్తం 117 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ కుంభకోణం జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇక నకిలీ చెక్కుల కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ విషయంలో తనది పాత్ర ఉందని అధికారులు చెబితే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. కోర్టుగానీ, సీబీఐ గానీ, సీఐడీ గానీ తన పాత్ర ఉందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని, ఈ కుంభకోణంలో నిజాలు తేల్చాలని తానే స్వయంగా సీబీఐని కోరుతానని వెల్లడించారు.

Read more:

కరోనా నుంచి కోలుకున్న పిల్లల్లోనూ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌

కరోనా: ప్రముఖ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత పరిస్థితి విషమం