Bigg Boss 4: మోనాల్‌తో అఖిల్ లవ్.. ఇంటికి రాగానే పెళ్లి చేస్తామంటోన్న తల్లి
ఈసారి బిగ్‌బాస్ 4 హౌజ్‌లో లవ్ స్టోరీలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. మొదటి నుంచి అఖిల్-అభిజిత్-మోనాల్‌ల మధ్య ఏదో జరుగుతూనే ఉంది.
Akhil Monal Love: ఈసారి బిగ్‌బాస్ 4 హౌజ్‌లో లవ్ స్టోరీలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. మొదటి నుంచి అఖిల్-అభిజిత్-మోనాల్‌ల మధ్య ఏదో జరుగుతూనే ఉంది. మోనాల్‌పై ఈ ఇద్దరు ఆసక్తిని చూపుతుండగా.. ఆమె కూడా ఈ ఇద్దరితో క్లోజ్‌గా ఉంటోంది. మరోవైపు ఈ సీజన్‌లో పులిహోర రాజాగా పేరు తెచ్చుకున్న అభిజిత్.. మోనాల్‌తో పాటు అటు హారికతోనూ రొమాన్స్ చేస్తున్నాడు. అయితే అఖిల్ మాత్రం మోనాల్‌కి ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషయంలో నీదే అసలు తప్పంటూ దివి, మోనాల్‌ని ఎదురుగానే కడిగేసింది.
ఇదిలా ఉంటే హౌజ్‌లో అఖిల్ లవ్‌పై అతడి తల్లిదండ్రులు అంత సంతృప్తిగా లేరు. ఈ విషయాన్ని అఖిల్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక అఖిల్ తల్లి సైతం మోనాల్‌తో లవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌజ్‌లో నుంచి అఖిల్ రాగానే, అతడికి ఓ అందమైన తెలంగాణ అమ్మాయితో పెళ్లి చేస్తామని అఖిల్ తల్లి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం అఖిల్‌కి సంబంధాలు చూస్తున్నామని, అఖిల్ తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని చెబుతున్నారు. చూస్తుంటే ఒకవేళ అఖిల్, మోనాల్‌ని సీరియస్‌గా లవ్ చేసినా.. వారిద్దరి పెళ్లి చేసేందుకు అఖిల్ తల్లిదండ్రులు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. మరి వీరి ప్రేమ షో వరకు మాత్రమేనా..? లేక బయటికి వచ్చాక కూడా కొనసాగుతుందా..? వంటి విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Read More: