Bigg Boss 4: ట్రయాంగిల్ లవ్‌ స్టోరీ.. మోనాల్‌ మిస్టేక్‌ అని తేల్చేసిన దివి

బిగ్‌బాస్‌ హౌజ్‌లో నడుస్తున్న ట్రైయాంగిల్ లవ్ స్టోరీపై మరోసారి హౌజ్‌లో చర్చ జరిగింది. ఈ సారి మోనాల్‌ వద్ద ఈ ప్రస్తావనను దివి తీసుకొచ్చింది

Bigg Boss 4: ట్రయాంగిల్ లవ్‌ స్టోరీ.. మోనాల్‌ మిస్టేక్‌ అని తేల్చేసిన దివి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 10, 2020 | 8:25 AM

Divi questions to Monal: బిగ్‌బాస్‌ హౌజ్‌లో నడుస్తున్న ట్రైయాంగిల్ లవ్ స్టోరీపై మరోసారి హౌజ్‌లో చర్చ జరిగింది. ఈ సారి మోనాల్‌ వద్ద ఈ ప్రస్తావనను దివి తీసుకొచ్చింది. మీ ముగ్గురి మధ్య ఏం జరుగుతుందో తెలీదు కానీ.. అఖిల్‌, అభి ఇద్దరూ మోనాల్‌కి నేనంటే ఇష్టం అనుకుంటున్నారు. నామినేషన్ అప్పుడు ఏమైందని కాదు. కానీ అంతకు ముందు కూడా ఇది ఉంది. ఇద్దరూ జన్యున్‌గా ఉంటున్నారు. నువ్వు ఇద్దరితో ‌మాట్లాడి, ఇద్దరి మైండ్‌లో నువ్వంటే ఇష్టం అని క్రియేట్ చేయడం నీ తప్పు అంటూ డైరెక్ట్‌గా చెప్పేసింది.

దానికి స్పందించిన మోనాల్‌.. నేను ఇద్దరినీ లైక్ చేస్తున్నా. కానీ పేరును వాడటం ఇష్టం లేదు. మా మధ్య ఏం జరగలేదు. చిన్న మ్యాటర్‌ని పెద్దదిగా చేస్తున్నారు అంతే అని మోనాల్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ డిస్కషన్‌లోకి రాజశేఖర్ మాస్టర్ కూడా వచ్చాడు. స్వాతి వచ్చిన తరువాత ట్రాక్ మారిందని, అఖిల్ పర్లేదు కానీ అభితో జాగ్రత్తగా ఉండాలని మాస్టర్ గుసగుసలాడాడు.

Read More:

Bigg Boss 4: మోనాల్‌పై జీరో పర్సంట్ నమ్మకం కూడా లేదన్న అఖిల్‌

Bigg Boss 4: చనిపోయిన నా బిడ్డను భుజంపై వేసుకొని వెళ్లా.. ఏడ్చేసిన గంగవ్వ