AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? గోవా కాలేజీలో ఈ కోర్సు చదవండి!

పెళ్లి కోసం ప్రత్యేకంగా కోర్సు చేయాల్సిందేనా? అవును.. వివాహ జీవితంపై యువతకు అవగాహన కల్పించేందుకు గోవాలోని ఓ కాలేజీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'మ్యారేజ్ రెడీనెస్' పేరుతో 15 రోజుల సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించింది. పెళ్లికి ముందు పరస్పర అవగాహన, నమ్మకం, బాధ్యతలు, కుటుంబ బంధాల గురించి ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో విడాకుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సుకు ప్రాధాన్యత ఏర్పడింది..

పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? గోవా కాలేజీలో ఈ కోర్సు చదవండి!
Marriage Readiness Course In Goa College
Srilakshmi C
|

Updated on: Nov 05, 2026 | 9:12 AM

Share

గోవా, నవంబర్‌ 5: సాధారణంగా విద్య, ఉద్యోగం, కెరీర్ కోసం యువత ఎన్నో ఏళ్లపాటు కష్టపడుతుంటారు. కానీ జీవితంలో ఎంతో కీలకమైన వివాహ బంధం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నారు? పెళ్లికి ముందు దాంపత్య జీవితంపై సరైన అవగాహన పెంచుకుంటున్నారా? అనే ప్రశ్నలకు సమాధానంగా గోవాలోని ఓ కళాశాల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివాహ జీవితానికి యువతను మానసికంగా, భావోద్వేగపరంగా సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా ‘మ్యారేజ్ రెడీనెస్’ (Marriage Readiness) సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించింది.

గోవా కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ ఈ వినూత్న కోర్సును ప్రవేశపెట్టింది. కళాశాల ప్రిన్సిపాల్ మహేశ్ పై వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘మ్యారేజ్ రెడీనెస్: ప్రిపేరింగ్ ఫర్ హెల్తీ అండ్ లాస్టింగ్ రిలేషన్‌షిప్స్’ పేరుతో ఈ కోర్సును నిర్వహించనున్నారు. కళాశాల హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 2 నుంచి 17 వరకు 15 రోజుల పాటు తరగతులు జరగనున్నాయి. చాలామంది పెళ్లి అంటే వివాహ వేడుక, బంధువులు, ఖర్చులు, ఏర్పాట్లు మాత్రమే అనుకుంటారు. కానీ వివాహ బంధం విజయవంతంగా కొనసాగాలంటే అంతకంటే ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉంటాయని మహేశ్ పై తెలిపారు. తమను తాము అర్థం చేసుకోవడం, జీవిత భాగస్వామి ఆలోచనలు తెలుసుకోవడం, పరస్పర అవగాహన, నమ్మకం, నిబద్ధత, కుటుంబ బాధ్యతలను స్వీకరించడం వంటి అంశాలపై అవగాహన అవసరమని చెప్పారు. ఆరోగ్యకరమైన, దీర్ఘకాలిక వైవాహిక సంబంధాన్ని నిర్మించుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుందని వివరించారు.

గోవాలో విడాకుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సుకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో విడాకుల సంఖ్యను తగ్గించేందుకు పెళ్లికి ముందే కౌన్సెలింగ్ కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇటీవల పనాజీలో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. గోవా న్యాయశాఖ గణాంకాల ప్రకారం.. 2022 నుంచి 2025 మధ్య రాష్ట్రంలోని సివిల్ కోర్టుల్లో వివాహం, విడాకులకు సంబంధించిన 3,000కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఒక్క 2024లోనే 947 పిటిషన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వివాహానికి ముందు అవగాహన కార్యక్రమాల అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది.

ఇవి కూడా చదవండి

ఎవరెవరు ఈ కోర్సులో చేరవచ్చు?

ఈ 15 రోజుల సర్టిఫికెట్ కోర్సులో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులతో పాటు పెళ్లి కాని యువత, ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్మించుకోవాలనుకునే ఇతర ఆసక్తిగల వ్యక్తులు కూడా పాల్గొనవచ్చు. పెళ్లికి ముందు కేవలం వేడుకలకే కాకుండా, వివాహ బంధంలోని బాధ్యతలు, పరస్పర అవగాహన, భావోద్వేగ అనుబంధంపై కూడా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో గోవా కళాశాల ఈ కొత్త కోర్సును తీసుకొచ్చింది. వివాహ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకుని, బలమైన కుటుంబ బంధాలను నిర్మించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు భావిస్తున్నారు.

Follow Us